ప్రతి జీవి తన తర్వాతి తరాన్ని ఈ భూమి మీదకు తీసుకొచ్చేందుకు రకరకాల పద్దతులను పాటిస్తాయి. కొన్ని గుడ్లు పెడతాయి, మరికొన్ని డైరెక్ట్ గా పిల్లల్ని కంటాయి. మరి తేళ్ల విషయంలో ఈ ప్రాసెస్ కాస్త ఢిపరెంట్ గా ఉంటుంది.మగ తేళ్లు వైబ్రేషన్స్ చేస్తూ ఆడ తేళ్ల దగ్గరకు చేరుకుంటాయి. కొన్ని రోజుల పాటు ఆడమగ తేళ్లు కలయికలో ఉంటాయి. ఒక్కసారి జరిగిన ఆ కలయిక వల్ల ఆడతేలు వీపు నుండి ఏడాది వరకు పిల్లు తేళ్లు పుడుతునే ఉంటాయి! అవి కొన్నిరోజుల వరకు తల్లి తేలు వీపుపై అలాగే ఉంటాయి.
ఒక్కో ఆడ తేలు ఒక్కో విడతకు సుమారుగా 20 నుంచి 100 పిల్లలను కంటాయి. కానీ అన్ని తేళ్లు బతకవు. కొన్ని మాత్రమే 2 వారాల తర్వాత తల్లి వీపు నుంచి కిందకు దిగి సొంతంగా బతుకుతాయి. చిన్న తేళ్లు పూర్తిగా పెద్ద తేళ్లుగా మారడానికి 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. తేలు జీవిత కాలం 8 ఏళ్లు.