ఈ మధ్య గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. యవ్వన వయసులో హార్ట్ ఎటాక్ లు రావడంతో కన్నుమూస్తున్నారు. రీసెంట్ గా కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా రీసెంట్ గానే బాలీవుడ్ నటుడు…బిగ్ బాస్ ఫేమ్ సిద్దార్థ్ శుక్లా సైతం గుండె పోటుతో మరణించాడు. కాగా తాజాగా తరగతి గదిలో పాఠం చెబతూనే ఓ ఉపాద్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పట్టం పాలెం ఎంపీపీ పాఠశాలలో చోటుచేసుకుంది.
Advertisement
Advertisement
పట్టం పాలెం స్కూల్ లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ఉపాద్యాయుడు ఎస్ వెంకటేశ్వర రావు 50 పాఠం చెబుతూనే గుండె పోటు రావడంతో కుప్ప కూలారు. వెంకటేశ్వర రావు విధుల్లో భాగంగా మంగళవారం పాఠశాలకు హాజరయ్యారు. మద్యాహ్నం భోజనం తరవాత మళ్లీ క్లాసు చెప్పేందుకు వెళ్లారు. కాగా పాఠం చెబుతున్న సమయంలో వెంకటేశ్వర రావు గుండె నొప్పి రావడంతో కుప్ప కూలారు. తీవ్రశ్వాస సమస్య రావడంతో వెంటనే తోటి ఉపాద్యాయులు తాడేపల్లి గూడెం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది సేపటికే వెంకటేశ్వర రావు మృతి చెందారు. అప్పటి వరకూ వెంకటేశ్వర రావు తమతో మాట్లాడాడని..హుషారుగా గడిపారని తోటి ఉపాద్యాయులు ఆదేదన వ్యక్తం చేశారు. తమ తోటి ఉపాద్యాయుడు మృతి చెందడంతో కంటతడి పెట్టుకున్నారు. వెంకటేశ్వర రావు భార్య పరమేశ్వరి కూడా ప్రభుత్వ ఉపాద్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర రావు మృతి చెందడంతో ఆయన పని చేస్తున్న గ్రామంలో మరియు నివాసం ఉంటున్న గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.