తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు హీరోయిన్ లు తమ నటనతోనే అభిమానులను సంపాదించకునేవారు. గ్లామర్ షోకు చాలా దూరంగా ఉండేవారు. అప్పటి నటీమణుల్లో కండ్లతోటే భావాలు పలికిస్తూ తన అందం నటనతో మంత్ర ముగ్దులను చేసిన హీరోయిన్ సావిత్రి. మహానటి సావిత్రి అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణించి చెరగని ముద్రవేసుకుంది. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సావిత్రి మొదట నాటకాల్లో ప్రతిభ చూపించి ఆ తరవాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
Advertisement
అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికీ సావిత్రిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు అంటే ఆమె ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలకు జొడీగా సావిత్రి నటించారు. తమిళలనాట కూడా సావిత్రి స్టార హీరోయిన్ గా రాణించారు. తమిళనాడు ప్రభుత్వం సావిత్రికి నటిశిరోమణి, ఉత్తమనటి, మహానటి లాంటి అవార్డులను ప్రధానం చేసింది.
Advertisement
ఇక సావిత్రి మంచి తనాన్ని చాలా మంది వాడుకుని పైకి వచ్చారు. ఆమెను నిలువునా ముంచేశారు. శారీరకంగా మానసికంగా సావిత్రి కృంగి పోయేలా చేశారు. స్టార్ హీరో జెమిని గణేషణ్ సావిత్రి ని వివాహం చేసుకుని మోసం చేశాడు. దాంతో సావిత్రి డిప్రెషన్ లోకి వెళ్లి తాగుడుకు సైతం భానిసయ్యారు. ఆ తరవాత ఆ మత్తులోనే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కన్నుమూశారు. సావిత్రి జీవితం ఇప్పటి హీరోయిన్ లకు ఒక గుణపాఠం. ఇక చివరిరోజుల్లో సావిత్రి ఓ కోరిక కోరినట్టు తెలుస్తోంది.
తను చనిపోయిన తరవాత తన సమాధిపై …..జీవితంలోనూ మరణంలోనూ మహోన్నతమైన తార ఇక్కడ విశ్రాంతి పొందుతున్నది. ఎవరూ సానుభూతితో ఇక్కడ వేడి కన్నీటి బొట్లను విడువనక్కర లేదు. సమాజంలో ఏ తార కూడా హీనంగా చూడకుండా ఇక్కడ నిద్రిస్తున్న మరణంలేని మహా ప్రతిభకు మృతి చిహ్నంగా పూల మాలికను ఉంచండి…అది చాలు అంటూ సావిత్రి తన చివరిరోజుల్లో చెప్పారని సినీ క్రిటిక్ నందగోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ALSO READ : Prabhas : ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా..?