Satyabhama Review: సుమన్ చిక్కాల ఈ సిమాకు దర్శకత్వం వహించారు. సత్యభామ సినిమాను బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మించారు. సంగీతాన్ని శ్రీ చరణ్ పాకాల అందించారు. కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవివర్మ తదితరులు నటించగా విష్ణు బేసి సినిమాటోగ్రఫీను అందించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.
సినిమా: సత్యభామ
దర్శకత్వం: సుమన్ చిక్కాల
నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి
నటీ నటులు: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవివర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
Advertisement
కథ మరియు వివరణ:
సత్యభామ మూవీ ఒక లేడీ ఓరియంటెడ్ కథ. హీరోయిన్ కాజల్ కు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సినిమా కథ విన్నాక ఎంతో నమ్మకం వచ్చి చేయాలనుకుంది. అయితే ఈ సినిమా ఒక కొత్త ప్రయత్నం గా కాజల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ స్టాంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో కాజల్ పాత్ర పేరు సత్యభామ, ఈమె ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తారు. ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఎంతో స్పెషల్ కేసు అనేది ఒకటి ఉంటుంది అదేవిధంగా ఈ కథలో సత్యభామ ఒక కేసును పర్సనల్ గా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినదే ఈ సినిమా.
ఇక కథ విషయానికి వస్తే.. సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీం కి ఏసీబీ స్థాయిలో పనిచేస్తారు. ఈ క్రమంలోనే ఆమె ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటూ నేరస్తుల దగ్గర నుండి నిజాలు రాబడతారు. ఈ విషయంపై ఎంతో ప్లాన్ చేసుకుని వాళ్ళ చేత నిజాలను కక్కిస్తూ ఉంటారు. ఆడవాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వాళ్ళ పట్ల ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో రచయిత అయిన అమరేందర్ ని పెళ్లి చేసుకుంటుంది. ఆమె తన వ్యక్తిగత జీవితం కంటే కూడా డ్యూటీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. ఒకరోజు హసీనా అనే ఆవిడ తన భర్త తనని ఇబ్బందులకి గురిచేస్తున్నాడని సత్యభామ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. సత్యభామ నీకేం భయం లేదు నేను ఉన్నాను అని ధైర్యం చెబుతారు. హసీనా భర్త తనను హత్య చేస్తాడు ఇక అతను చూసి చలించిపోయిన సత్యభామ అతన్ని పట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. హసీనా మరణం వెనుక సత్యభామ వైల్డ్ గా రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటి..? హసీనాకు ఆమెకు ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాలి. డైరెక్టర్ తీసుకున్న కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా కూడా కథనంలో ఆయన అనుసరించిన విధానం ఓకే ఓకే అనిపిస్తుంది.
Advertisement
Also read:
సినిమా నడుస్తున్న కొద్ది పాత్రలోనే క్యారెక్టర్రైజేషన్ చాలా దాకా పక్కదారి పడుతూ ఉంది. తన క్యారెక్టర్ ఎలా ఉంటుందని సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారో అలాంటి క్యారెక్టర్ని కాకుండా ఇంకో రకమైన క్యారెక్టర్ని పోషించాల్సి వస్తుంది. దాని వలన ఆమె పాత్రతో ప్రేక్షకుడు ట్రావెల్ అవ్వలేక పోతాము. సినిమా స్క్రీన్ ప్లే పరంగా పర్లేదు అనిపించిన అక్కడక్కడ కొన్ని తప్పులు అయితే జరిగాయి. మెయిన్ పాయింట్ ని పక్కన పెట్టేసి సబ్ ప్లాట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. స్క్రీన్ ప్రజెంట్ చేయడంలో తడబడ్డాడు. మ్యూజిక్ కూడా పెద్దగా ప్లస్ అవ్వలేదు. మొత్తానికి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బానే ఉన్నాయి. కాజల్ అగర్వాల్ తన నటనతో బానే మెప్పించారు. టెక్నికల్ అంశాల విషయానికొస్తే మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించేలా ఉంది. కాజల్ అగర్వాల్ నటన సినిమాలో ట్విస్టులు సినిమాకి ప్లస్ అయ్యాయి.
Also read:
ప్లస్ పాయింట్స్:
కాజల్ అగర్వాల్
ట్విస్టులు
మైనస్ పాయింట్లు:
రొటీన్ కథ
బోరింగ్ సీన్స్
రేటింగ్: 2.25/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!