కొన్ని సినిమాలు రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతాయి. అలా తెరకెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకుల మనసుదోచేస్తాయి. అలాంటి రియల్ స్టోరీతోనే శోభన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సర్పయాగం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శోభన్ బాబుకు కూతురు పాత్రలో రోజా నటించింది. ఈ సినిమా రోజాకు రెండో సినిమాగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను రిలయ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారని చాలా మందికి తెలియదు.
Advertisement
నిజానికి ఈ సినిమా కథ నిజంగా ఒంగోళులో జరిగింది. ఒంగోళులో ఆ రోజుల్లో రౌడీయిజం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో ముగ్గురు యువకులు ఓ కాలేజీ యువతిపై మానభంగం చేశారు. ఆ యువతి తండ్రి పేరు టిప్ టాప్ రామిరెడ్డి….కోదండ రామిరెడ్డికి చెందిన డ్రౌక్లీనింగ్ దుకాణం పేరు టిప్ టాప్ కావడంతో ఆయన టిప్ టాప్ రామిరెడ్డిగా ఒంగోళులో ఫేమస్ అయ్యారు. రామిరెడ్డి భర్య మరణించడంతో కూతురును అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.
Advertisement
డిగ్రీ తరవాత కూతురు వివాహం జరిపించాలని అనుకున్నారు. కానీ ముగ్గురు మృగాళ్లు చేసిన పని వల్ల రామిరెడ్డి కూతురు లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఆ లెటర్ లో….ఆ ముగ్గురినీ వదిలి పెట్టొద్దు నాన్న అని రాసి ఎంతో ఆవేదనతో తండ్రికి చివరి లేఖ రాసింది. ఇక ఆ ముగ్గురు యువకులు కూడా చిల్లరగా తిరిగేవారే. వారిలో డబ్బు అధికారం కలిగిన కుటుంబాల నుండి కూడా ఉన్నారు. ముగ్గురిలో ఒకడు హాకీ కోచ్, మరొకడు ఆర్టీసీ డిపో మేనేజర్ కొడుకు వాడికి డబ్బు పొగరు రాజకీయ అండదండలు ఉన్నాయి.
మూడో వాడు ఓ తాగుబోతు కాగా కూతురు రాసిన లెటర్ చదివి కోపంతో రగిలిపోయిన టిప్ టాప్ రామిరెడ్డి పథకం రచించాడు. ఇద్దరు కిరాయి మనుషులతో కలిసి కూతురును పాడు చేసిన ఇద్దరు మానవమృగాలను హతమార్చాడు. ఆ తరవాత పోలీసులకు దొరికిపోయాడు. ఈ విషయం ఒంగోళులో ఆ నోట ఈనోట పడి బయటకు పొక్కింది. దాంతో టిప్ టాప్ మారిరెడ్డి హీరో అయిపోయాడు. ఉదయం పేపర్ లో వచ్చిన ఈ వార్తను పరుచూరి బ్రదర్స్ చదివారు. అదే కథతో సర్పయాగం సినిమా చేయగా అప్పట్లో టాలీవుడ్ ను షేక్ చేసింది.