Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాకు కు గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ దర్శకత్వం వహించారు. బ్యాంక్ లావాదేవీలు, ఈఎమ్ఐ లాంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా మహానటి కీర్తి సురేష్ నటించింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
కొంతమంది సినిమా చాలా బాగుందని మంచి మెసేజ్ ఉన్న సినిమా అని ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మరికొందరు మహేష్ బాబు గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఉందని చాలా బోరింగ్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా స్క్రీన్ ప్లే ఎడిటింగ్ విషయంలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని కొన్ని సీన్లలో దర్శకుడు లాజిక్ మిస్ అయ్యాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ మొదట మహేష్ బాబు వద్ద పదివేల డాలర్ల అప్పు తీసుకుంటుంది. ఆ తర్వాత మరో పాతికవేలు అప్పు గా తీసుకుంటుంది. అయితే ఎంపీ కూతురు అంత తక్కువ మొత్తం అప్పు చేయడమేంటని సినిమా చూసిన ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా మొదట తీసుకున్న పదివేల డాలర్ల కోసం ఇండియాకు వచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత తీసుకున్న పాతికవేల ను మాత్రం రికవరీ చేయరు…ఈ లాజిక్ ను దర్శకుడు ఎలా మిస్ అయ్యాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇవే కాక సినిమా లో మరికొన్ని సీన్లలో కూడా దర్శకుడు తడబడ్డాడు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
Also read :
మహేష్ బాబుకు సపోర్ట్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్…ఏమందంటే…!