Home » మహేష్ బాబుకు సపోర్ట్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్…ఏమందంటే…!

మహేష్ బాబుకు సపోర్ట్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్…ఏమందంటే…!

by AJAY

మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ తనను బాలీవుడ్ భరించలేదని అన్నారు. దాంతో ఆయన వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. కొందరు మహేష్ బాబు పై విమర్శలు కురిపిస్తున్నారు.

kangana

kangana

దాంతో తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మహేష్ బాబుకు సపోర్ట్ గా నిలిచింది. కంగనా నటించిన ధాకడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ….మహేష్ బాబు అన్నది నిజమే అని చెప్పింది. ఆయనను బాలీవుడ్ బరించలేదని వ్యాఖ్యానించింది.

ఇప్పటికే బాలీవుడ్ నుండి మహేష్ బాబు ను ఎంతోమంది సినిమా కోసం సంప్రదించారని చెప్పింది. ఆ విషయం తనకు తెలుసని చెప్పింది. అయినా టాలీవుడ్ దేశంలోనే నంబర్ వన్ స్థానం లో నిలిచిందని చెప్పింది. కోలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీ లను టాలీవుడ్ దాటి వెళ్లిందని చెప్పింది. దేశంలోనే టాలీవుడ్ నంబర్ వన్ స్థానం లో ఉందని టాలీవుడ్ ను చూసి చాలా నేర్చుకోవాలని కామెంట్స్ చేసింది.

Also read :

బాలయ్య కూతురు పెళ్లిలో ఎన్టీఆర్ ను అంతలా అవమానించారా…? అసలేం జరిగిందంటే..!

Visitors Are Also Reading