Home » మన టైం కూడా వస్తుంది అంటూ తమ్ముడిని ఓదార్చిన సారా టెండూల్కర్..!

మన టైం కూడా వస్తుంది అంటూ తమ్ముడిని ఓదార్చిన సారా టెండూల్కర్..!

by Azhar
Ad

ఐపీఎల్ 2021 మరియు 2022 రెండు సీజన్ లలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు సచిన్ టెండ్యూలక్ర్ కొడుకు అర్జున్ టెండూల్కర్. గత ఐపీఎల్ లో అతడిని 20 లక్షలను కొనుగోలు చేసిన ముంబై ఈ ఏడాది 30 లక్షలను మళ్ళీ తీసుకుంది. కానీ ఈ రెండు సీజన్ లలో అతనికి తుది జట్టులో అవకాశం కల్పించలేదు. దాంతో టెండ్యూలక్ర్ అభిమానులు కూడా బాగా నిరాశ చెందారు. ఇక నిన్న ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఢిల్లీతో ఆడింది. ఈ మ్యాచ్ లో తప్పకుండ అర్జున్ ఉంటాడు అనుకున్న.. అతనికి అవకాశం రాలేదు.

Advertisement

దాంతో అర్జున్ కూడా బాగా నిరాశ చెందినట్లు కనిపించడంతో తన అక్క అయిన సారా టెండూల్కర్ తన తమ్ముడిని ఓదార్చింది. నిన్న గ్రౌండ్ బయట నడుస్తున్న అర్జున్ వీడియోను తీసుకొని… రన్ వీర్ సింగ్ గల్లీ బాయ్ సినిమాలోని అప్నా టైం ఆయేగా అనే పాటను జత చేసింది. దీనికి అభిమానులు కూడా బాగానే రియాక్ట్ అవుతున్నారు. అక్క తమ్మునికి మద్దతు ఇస్తుంది అంటున్నారు.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ లో వరుసగా 8 మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న తర్వాత తమ జట్టులో అందరి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. అందువల్ల పార్థి మ్యాచ్ కు ముందు ఇందులో అర్జున్ ఉంటాడు అని ప్రచారం జరిగిన అది జరగలేదు. ఐపీఎల్ లో అర్జున్ అరంగేట్రం కాలేదు. అందువల్ల ఫ్యాన్స్ కు ముంబై తీరుని తప్పు బడుతున్నారు. మీకు ఆడించాలి అని లేకుంటే అతడిని ఎందుకు గత రెండు సీజన్లుగా మీ జట్టులో ఉంచుకుంటున్నారు.. అతడిని వదిలేస్తే కనీసం వేరే జట్లకైనా ఆదుకుంటాడు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వానగండం గుజరాత్ కు కలిసి వస్తుందా..?

ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!

Visitors Are Also Reading