సంజూ శాంసన్ భారత జట్టు తరపున అరంగేట్రం చేసి ఏడు ఏళ్ళు అవుతున్నా.. అతను ఆడినవి తక్కువ మ్యాచ్ లే అయినా కూడా అతనికి భారత జట్టులో ఉన్న స్టార్ ఆటగాళ్లతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. అయితే సంజూకి ఇంత మంది అభిమానులు రావడంలో ఐపీఎల్ ఓ కారణం కాగా.. మరో కారణం బీసీసీఐ. అతను ఐపీఎల్ లో ఎంత బాగా ఆడినా కూడా అతనికి భారత జట్టులో చోటు అనేది రాకపోవడం.. అభిమానులను కదిలించింది. అలాగే అతని స్థానంలో జట్టుకు వచ్చిన ఆటగాళ్లు.. అంతగా రాణించకపోయినా కూడా వారికీ అవకాశాలు ఇస్తూ వచ్చేది బీసీసీఐ.
Advertisement
అందుకే సంజూకి తెలియకుండానే అభిమానులు అనేవారు వచ్చారు. ఇక ఏ సిరీస్ కు జట్టును ప్రకటించిన అందులో సంజూ లేకపోతే నెట్టింట్లో బీసీసీఐపై దారుణామమైన ట్రోలింగ్ అనేది జరుగుతూ వస్తుంది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో కెప్టెన్ గా రాజస్థాన్ రాయల్స్ ను ఫైనల్ కు చేర్చిన సంజూను మొదట.. ఐర్లాండ్ పర్యటనకు రెండో జట్టుతో పంపింది. అక్కడ ఒక్క మ్యాచ్ లో అవకాశం రాగా అందులో 70కి పైగా పరుగులు చేసాడు. ఇక ఇప్పుడు తాజాగా వెస్టిండీస్ పర్యటలో వన్డే జట్టుకు ఆడిన సంజూ ఒక్క అర్ధశతకం అనేది చేసాడు. అయితే ఈ వన్డే జట్టులో ఉన్న సంజూను మొదట టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేయలేదు.
Advertisement
అందువల్ల బీసీసీఐని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేసారు. ఇక ఈ పర్యటనకు ఫిట్ గా లేని కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ ఈ పర్యటనకు బయలుదేరే ముందు ఎన్సీఏ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న సమయంలో రాహుల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. అందువల్ల బీసీసీఐ అతని స్థానంలో సంజూను ఈ టీ20 సిరీస్ కు ఎంపిక చేసింది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే సంజూ కేవలం పేరుకే జట్టులోకి తీసుకున్నారా… లేదా తుది జట్టులో చోటు కూడా ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ సంజూతో మ్యాచ్ ఆడించకపోతే బీసీసీఐపై మళ్ళీ సీమర్శలు అనేవి రావడం ఖాయం.
ఇవి కూడా చదవండి :