పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లానాయక్. ఈ సినిమాలో రానా కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటూ స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
కానీ ఈ సినిమా విషయంలో నిత్యా మీనన్ హర్ట్ అయ్యిందని..అందువల్లే ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా దూరంగా ఉందని వార్తలు వినిపిస్తుండగా ఇప్పుడు మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విషయంలో సంయుక్త మీనన్ కూడా హర్ట్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Advertisement
పవన్ కల్యాణ్ రానాల మల్టీ స్టారర్ కావడంతో సంయుక్త మీనన్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కోసం సంయుక్త 20 రోజులు షూటింగ్ కు వచ్చిందట. కానీ తీరా సినిమా విడుదలయ్యాక సంయుక్తకు సంబంధించిన చాలా సీన్లను కట్ చేశారట. ఈ విషయంలోనే సంయుక్త హర్ట్ అయినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉంటే సినిమా ఫైనల్ అవుట్ పుట్ కోసం కటింగ్ లు చేయడం సహజమే. అయితే కొన్ని సార్లు నటీనటులు తమ కష్టానికి ప్రతిఫలం దక్కలేదని బాధపడుతుంటారు.