Home » హృద‌య కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట‌, క్యాలీ ఫ్ల‌వ‌ర్….సినిమా స‌రే! మ‌రి ప్రేక్ష‌కులేమంటున్నారు?

హృద‌య కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట‌, క్యాలీ ఫ్ల‌వ‌ర్….సినిమా స‌రే! మ‌రి ప్రేక్ష‌కులేమంటున్నారు?

by Azhar
Ad

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన‌ ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని ప్రేక్షకులకు సూపర్‌హిట్‌ చేశారు. తాజాగా మరో కొత్త క్రేజీ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి రెడీ అయ్యారు సంపూర్ణేష్‌ బాబు. ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఇటీవ‌ల సంపూర్ణేష్ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేక‌ర్స్‌.

Advertisement

ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తి గెటప్‌లో సంపూ లుక్ ఈ చిత్రంలో ఉంటుంది. అలాగే సంపూ మార్క్‌స్టైల్‌ ఈ ఫస్ట్‌ లుక్‌ లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌ బ్యాంగ్‌ వీడియోలో సంపూ అలరించిన తీరు ‘క్యాలీఫ్లవర్‌’ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. మరోసారి సంపూ స్టైల్‌ ఆఫ్‌ కామెడీని ‘క్యాలీఫ్లవర్‌’ చిత్రంతో హాస్య ప్రియులు ఎంజాయ్‌ చేయనున్నారా.. లేక ఈ సినిమా కూడా థియేట‌ర్‌లో ఎప్పుడు వచ్చుద్దో ఎప్పుడు వెళిపోతుందో కూడా తెలియ‌కుండా పోతుందా.

Advertisement

సంపూర్ణేష్‌బాబు మొద‌టి సినిమా నుంచి కూడా ఎవ‌రో ఒక హీరోని ఇమిటేట్ చేస్తూ ఓ మూస క‌థ‌ల‌తో సినిమాలు చేసుకుంటూ వెళిపోతున్నాడు. ఉదాహ‌ర‌ణ‌కి బాల‌కృష్ణ డైలాగులు ఇంచుమించు అలాగే ఉంటాయి. ఇమిటేషన్ సినిమాలకు లిమిటేషన్స్ పెట్టుకునే సమయం ఆసన్నమయింది సంపూ అంటున్నారు కొంత‌మంది ప్రేక్ష‌కులు. తొలి చిత్రాన్ని నీ ఇమిటేషన్ తో మెప్పించావు…అంతకు మించి నీ లిమిటేషన్స్ లో ఉండకపోతే నెక్స్ట్ బర్త్ డేకి నీ పేరు సినిమాల్లో ఉండదని గుర్తుంచుకో అని సినీ అభిమానులు కోరుతున్నారు. మగవాళ్ళ శీలం అంటూ వల్గర్ డైలాగులతో వస్తున్న క్యాలి ఫ్లవర్ సినిమాతో నిర్మాతలు ఏమి చెప్ప‌ద‌లిచారు.

కామెడీ చిత్రాలంటే కుటుంబ స‌మేతంగా వెళ్ళి హాయిగా న‌వ్వుకునే విధంగా ఉండాలికాని డ‌బుల్‌మీనింగ్ డైలాగుల‌తో అర్ధ‌మ‌యి అర్ధం కాని కామెడీలాగా ఉండ‌కూడ‌దు. ఎటువంటి ఎమోష‌న్స్ లేకుండా ఎప్పుడూ ఒకేర‌క‌మైన మూస క‌థ‌ల‌తో వెళ్ళాలంటే ఎప్పుడూ టైమ్ మ‌న‌కి అనుకూలంగా ఉండ‌దు. ఇలాంటి వ‌ల్గ‌ర్ కామెడీలు ఆప‌క‌పోతే క్యాలీఫ్ల‌వ‌ర్ కాదు పిచ్చి ఫ్ల‌వ‌ర్ అయ్యే ప్ర‌మాద‌ముందని ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు నిన్న విడుద‌లైన ట్రైల‌ర్ చూసి అనుకుంటున్నారు.

Visitors Are Also Reading