టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే సమంత హీరోయిన్ గా విజయ్ సేతుపతి పక్కన కాదు వాక్కుల రెండు కాదల్ అనే తమిళ సినిమా చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ కు జోడిగా సమంత కుషి నే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మరో వైపు ఫ్యామిలీ మ్యాన్, పుష్ప లతో సమంత కు వచ్చిన క్రేజ్ వల్ల బాలీవుడ్ లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక సమంత సినిమాల విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టిివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, సినిమా విషయాలను అప్డేట్ చేస్తుంది. అంతే కాకుండా సమంత తన పెట్స్ ఫోటో లను కూడా తెగ షేర్ చేస్తుంది.
Advertisement
Advertisement
వర్క్ అవుట్ చేస్తున్నప్పుడు తన పెట్స్ వచ్చి దిస్టబ్ చేయడం…వాటితో ఆడుకోవడం ఇలా చాలా షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సమంత తన పెట్స్ తో ఒక ఫోటో ను షేర్ చేసింది. కాగా ఆ ఫోటోకు ఓ నెటిజన్ తిక్క తిక్కగా కామెంట్ చేశాడు. సమంత తన పెట్స్, కుక్కల తో ఒంటరిగా చనిపోవాలి. అంటూ నెటిజన్ తన కామెంట్ లో పేర్కొన్నాడు.
అయితే ఈ కామెంట్ చూసి సమంత బాధపడిందో కోపం తెచ్చుకుందో గానీ ….అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలు గా భావిస్తాను అంటూ కామెంట్ కు కౌంటర్ ఇచ్చింది. దాంతో వెంటనే ఆ నెటిజన్ ఆ కామెంట్ ను డిలీట్ చేసేశాడు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఆ స్క్రీన్ షాట్ లను వైరల్ చేస్తూ అతడి పై ఫైర్ అవుతున్నారు.