Home » పుష్ప సాంగ్‌.. మేల్ వెర్ష‌న్ ఎలా ఉందంటే..?

పుష్ప సాంగ్‌.. మేల్ వెర్ష‌న్ ఎలా ఉందంటే..?

by Bunty
Ad

ఇటీవ‌ల కాలంలో ఏదైనా పాట కానీ, డైలాగ్‌లు కానీ హిట్ అయ్యాయంటే చాలు వాటిని స్పూఫ్‌లు, క‌వ‌ర్స్‌గా మ‌లుస్తున్నారు నెటిజ‌న్లు. ఇటీవ‌ల వ‌చ్చిన బుల్లెట్ బండి పాట ఎంత హిట్ అయిందో తెలిసిన‌దే. ఈ సాంగ్‌కు మేల్ వెర్ష‌న్‌లో ఓ పాట‌ను రాసాడు నెటిజ‌న్‌. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌.. సూర్య‌వంశీ మూవీలోని నాజా సాంగ్‌ను అనేక మంది క‌వ‌ర్స్‌గా చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. అవి కాస్త నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.

 

Advertisement

ప్రస్తుతం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలోని సమంత స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా’ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. పాటలో లిరిక్స్‌కు తగినట్లుగా ఫోక్‌ సింగర్‌ ఇంద్రావతి చౌహన్‌ తన హస్కీ వాయిస్‌తో మెస్మరైజ్‌ చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్‌ వ‍్యూస్‌కుపైగా దూసుకెళ్లింది. సమంత నటించిన ఈ సాంగ్‌ యూట్యూబ్‌ను ఇప్పుడు షేక్ చేస్తోంది. ఈ సాంగ్‌లో మగాళ్లది వంకర బుద్ధి, అందరూ మగాళ్లు ఒకటే అన‍్నట్లుగా ఉంటాయి లిరిక్స్‌. దీనిపై కొంత మంది కేసులు కూడా వేశారు. అయితే తాజాగా ఈ పాటకు మేల్‌ వెర్షన్‌ సాంగ్‌ వచ్చింది. ‘మీ కళ్లల్లోనే వంకర ఉంది.. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి.. ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప’ అంటూ సాగుతోన్న ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

 

ఈ మేల్‌ వెర్షన్‌ పాటకు సంబంధించిన వీడియోను ఒకటి ట్విటర్‌ యూజర్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్ చేసాడు. ఇక ఈ పాటకు తగినట్టుగా పలు సినిమాల్లోని వీడియో, డ్యాన్స్‌ స్టెప్పుల క్లిప్‌లతో వీడియో తయారు చేయడం ఇప్పుడు ఆకట్టుకుంటోంది. మేల్‌ వెర్షన్‌ అదిరిపోయిందని కామెంట్స్‌ కూడా చేస్తున‍్నారు నెటిజన్స్‌. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత‍్రం డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. ప్ర‌స్తుతం క‌లెక్ష‌న్ల‌ రికార్డుల‌ను సృష్టిస్తుంది.

Visitors Are Also Reading