టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో సమంత నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతూ విడాకులు తీసుకున్నారు. ఏమ్మాయ చేసావే సినిమా షూటింగ్ సమయం లో వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తరవాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఈ జంట చాలా కాలం పాటు డేటింగ్ లో కూడా ఉన్నారు.
Advertisement
ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. సమంత నాగచైతన్య విడాకులను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రీసెంట్ గా సమంత తండ్రి కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగచతన్య ఫోటో ను షేర్ చేసి అతడు మా ఫ్యామిలీ తో గడిపిన క్షణాలను మర్చిపోలేం అంటూ కామెంట్స్ చేశారు.
Advertisement
త్వరలోనే అన్ని సర్దుకోవాలి అని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విడాకుల తరవాత సమంత నాగచైతన్య ఇద్దరూ సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్నారు. సమంత రీసెంట్ గా శాకుంతలం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సమంత రెండో పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సమంత విడాకులకు ఫ్యామిలీ మ్యాన్ సినిమా నే కారణం అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయం లో సమంత బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడినట్లు గా టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా త్వరలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలి అంటే సమంత నోరు విప్పాల్సిందే.