స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉంది సమంత. సినిమాలకు కొన్ని రోజులు గుడ్ బై చెప్పి తన వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని కేటాయించుకోనుందట. బాలి వెకేషన్ లో తన స్నేహితులతో గడుపుతోంది. ఈ వెకేషన్ అనంతరం సమంత మయోసైటిస్ కు చికిత్స తీసుకోనుందట.
Advertisement
ఈ చికిత్స కోసం కొన్ని రోజులపాటు సమంత అమెరికాకు వెళ్ళనుందని సమాచారం. తన కెరీర్ పై మయోసైటిస్ తీవ్ర ప్రభావం చూపింది. దీనివల్ల సమంత చాలా బాధపడవలసి వస్తుంది. మయోసైటిస్ బారిన పడటంతో సమంత తన చేతికి వచ్చిన ప్రాజెక్టులను చాలా వరకు మిస్ చేసుకుంది. దీంతో సమంత కొన్ని కోట్లలో నష్టపోవాల్సి వచ్చిందట. ఇక సమంత తన ట్రీట్మెంట్ కోసం ఏకంగా 25 కోట్లు చెల్లించనుందట. ఒక సంవత్సరం పాటు సమంత సినిమాలకు పూర్తిగా దూరం కానుందట.
Advertisement
దీంతో ఇంతకుముందు సైన్ చేసిన ప్రాజెక్టులను కూడా సమంత దూరం చేసుకుంది. కొన్ని ప్రాజెక్టులకు తీసుకున్న అడ్వాన్స్ ని కూడా తిరిగి చెల్లించేసిందట. ఈ ప్రాజెక్టులను వదులుకోవడం వల్ల సమంత 10 నుంచి 15 కోట్ల వరకు నష్టపోయిందని సమాచారం. దీంతో సమంత ఓ స్టార్ హీరో వద్ద అప్పు తీసుకుందని వార్తలు వస్తున్నా వస్తున్నాయి. ఇది వినడానికి చాలా చీప్ గా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు సమంత 13 సంవత్సరాల కు పైగా సినిమాలలో నటిస్తోంది తనకు అప్పు చేయడం అవసరం లేదు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత సినిమాలలో నటించినందుకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక కమర్షియల్ యాడ్స్, పలు బిజినెస్లలో సమంత కోట్లలో డబ్బులను సంపాదిస్తుంది. ఇక సమంతకు అప్పు చేయాల్సిన అవసరం లేదని వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై సమంత ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
Taraka Ratna: తారకరత్న ఏకంగా సీఎం భార్యతో రొ***న్స్ చేశాడా?
Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు ప్లేయర్లు దూరం!