టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సమంత… ఇప్పటికీ అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి సినిమాలో హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది సమంత. ఖుషి సినిమా విజయ్ దేవరకొండ మరియు సమంతకు మంచి హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
అయితే 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. దాదాపు నాలుగు సంవత్సరాలు వీరిద్దరూ వివాహ బంధాన్ని కొనసాగించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల 2021 డిసెంబర్ మాసంలో విడాకులు తీసుకున్నారు. ఇక 2021 నుంచి ఇప్పటివరకు సమంత మరియు నాగచైతన్య విడివిడిగానే ఉంటున్నారు.
Advertisement
Advertisement
ఇక తాజాగా నాగచైతన్య జ్ఞాపకాలను పూర్తిగా తొలగించింది సమంత. హీరోయిన్ సమంత ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే అందులో ఆమె తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య పేరుతో ఉన్న టాటూను తొలగించినట్లు కనిపిస్తోంది. మరి నిజంగా ఆమె టాటూ తొలగించారా ? లేక మేకప్ వేసి కవర్ చేశారా ? అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలోనే నాగచైతన్య మరియు సమంత మళ్ళీ ఒకటి కాబోతున్నారని మొన్నటి వరకు ప్రచారం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- పెళ్లికి ముందే జాన్వీ కపూర్ ప్రెగ్నెంట్.. సీక్రెట్ గా అబార్షన్ !
- Soundarya : సౌందర్యకు 200 కోట్ల ఆస్తులు రాసిచ్చిన హీరో… ఆ పని కోసమేనా?
- వెంకటచైతన్య రెండో పెళ్లి… నిహారిక సంచలన నిర్ణయం ?