టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత,నాగ చైతన్య కొన్ని నెలల క్రితం క్యూట్ కపుల్ గా వార్తల్లో నిలవడం అందరం చూశాం. వారి జంటను చూసి అబ్బా ఎంత చూడ చక్కనైన జంటో అంటూ ఫీలయ్యాం. ఇక వారి అభిమానుల ఆనందానికి అయితే హద్దులు లేవని చెప్పవచ్చు. అంతటి చక్కని జంట మూన్నాళ్ళైనా కాకముందే వారి మూడు ముళ్ల బంధానికి బ్రేక్ ఇచ్చారు. దీంతో అభిమానులంతా షాక్ అయిపోయారు. క్యూట్ జంట విడిపోయి ఎనిమిది నెలలైనా వారు విడాకులు తీసుకున్న విషయం మాత్రం నమ్మలేని నిజం గానే మిగిలిపోయింది.
వారు అసలు ఎందుకు విడిపోతున్నారు అనే విషయం ఇప్పటివరకు కూడా బయటకు రాలేదు. అయితే రాబోయే రోజుల్లో అయిన వీరిద్దరి మధ్య వచ్చిన సమస్య ఏంటి, ఎందుకు విడాకుల వరకు వెళ్లారు అనే విషయంపై క్లారిటీ ఇస్తారని అభిమానులంతా అనుకుంటున్నారు. అయితే వీరి వివాహం అయిన తర్వాత మాత్రం సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దపెద్ద ప్రాజెక్టులతో ఆఫర్లు వచ్చినా సమంత వాటిని తిరస్కరించిందని సమాచారం. ఆమెకు మొదట షారుక్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం వచ్చిందట. అయితే సమంత చైతన్య కోసం ఆ ఆఫర్ ను కూడా వదిలేసుకున్నారని తెలుస్తోంది.
Advertisement
Advertisement
జవాన్ సినిమా పేరుతో భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండడంతో అప్పట్లోనే సమంత ఈ మూవీ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు అని దీంతో అది నయనతారకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. అయితే ఆ సమయంలోనే సమంత ఈ స్టార్ హీరోల సినిమాలకు ఓకే చెప్పి ఉంటే మాత్రం ఆమె రేంజ్ ఇంకా పెరిగిపోయి ఉండేదాని నెటిజన్లు మరిన్ని కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంతా నటించినటువంటి శాకుంతలం మూవీ ఈ సంవత్సరం రిలీజ్ కానుంది. ఇదే కాకుండా అనేక ప్రాజెక్టుల్లో సమంత నటించబోతోందని తెలుస్తోంది.
also read;
వాట్సాప్ మరో కొత్త ఫీచర్.. మెసేజ్‌ను పొరపాటున డిలీట్ చేశారా..? ఇక త్వరలోనే..!
ఆ ఊరిలో సెల్‌ఫోన్, టీవీ, రేడియో నిషేదం.. ఎందుకో తెలుసా..?