Home » Samantha : ‘బజార్’ కోసం బరితెగించిన సమంత..ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌ !

Samantha : ‘బజార్’ కోసం బరితెగించిన సమంత..ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌ !

by Bunty
Ad

 

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటన, అందం, అమాయకత్వంతో ఎంతో మంది ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది. తెలుగులో తాను చేసిన మొదటి చిత్రం ”ఏ మాయ చేసావే”. ఈ సినిమా అనంతరం ఇప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ బ్యూటీ. ఇక కొన్ని రోజుల క్రితం సమంత మయూసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చికిత్స కోసం సమంత అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఇక ఏడాది పాటు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

ఇక సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. సమంత సోషల్ మీడియాలో పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, పలు ప్రమోషన్లను కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే సమంత ఫ్యాషన్ మ్యాగ్జిన్ అయిన బజార్ కోసం హాటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో బ్లాక్ కలర్ డ్రెస్ లో సమంత తన అందాలను ఆరబోసి చూపించి చూపించినట్టుగా కనిపించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మ్యాగ్జిన్ కోసం సమంత ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో తన విషయాలను పంచుకోవడం వల్ల తాను డిప్రెషన్ కి గురవడం లేదని పేర్కొంది. ఈ దేశంలో స్టార్ హీరోయిన్ గా ఉండడం ఒక అద్భుతమైన బహుమతి అని, దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నిజాయితీగా ఉండాలని అన్నారు. ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు, ఎన్నో అవార్డులను గెలుచుకున్నప్పటికీ పరిపూర్ణమైన శరీరం లేదా అత్యంత అందమైన దుస్తుల గురించి కాదు. బాధలు, కష్టాల గురించి ఉమెన్స్ ఎలా హ్యాండిల్ చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది సమంత. నా ఉమెన్స్ చాలా వరకు పబ్లిక్ గానే ఉన్నాయి. నేను వాటిని పట్టించుకోనని, నిజానికి వాటి ద్వారా నాకు చాలా బలం వచ్చిందని సమంత చెప్పుకొచ్చారు. ఇక సమంత చేసిన వాక్యాలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading