సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విడాకుల తరవాత సమంత ఏం చేసినా వివాదాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ కూడా వివాదాలకు తెరలేపింది. ఊ అంటావా మావా…ఊఊ అంటావా మావా అంటావా అంటూ చేసిన ఈ పాట సూపర్ హిట్ కాగా పురుష సంఘాలు మాత్రం పురుషులను కించపరిచేలా ఈ పాట ఉందంటూ ఫిర్యాదు చేశాయి. కాగా తాజాగా సమంత ఐటెమ్ సాంగ్ పై పురుష సంఘాలు చేస్తున్న ఆందోళన మీద హీరోయిన్ మాధవీలత స్పందించింది. ఫెమీనిజం భావాలు ఉండే మాధవీలత తనదైన రీతిలో కామెంట్లు చేసింది.
Advertisement
Advertisement
మాధవీలత తన ఫేస్ బుక్ పోస్టులో “వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా ఈ లెక్కన ఇండస్ట్రీలో 98శాతం సాంగ్స్ అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీస్ చేయాలి. అయితే నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకు కేసులు పెడతా..రారా సామీ సాంగ్ మీద ఏంటి ఒక అమ్మాయికి మగాడిని చూస్తే ఆటను పోలిస్తే అంత చులకనాగా వెంట పడి వెళ్లిపోద్దా..? అబ్బాయి నడిచిన చోట లాండ్ టచ్ చేసి మొక్కుద్దా..ఒక మహిళ పరువు పోయింది. చ నాకు నచ్చలే..నేను ఎడతా కేసు..అంతే తగ్గేదే లే..” అంటూ మాధవీత తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది.
ఇదిలా ఉండగా మాధవీలత టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అంతే కాకుండా సినిమాలపైనే అప్పుడప్పుడూ తనదైన రీతిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది.