Ad
నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంతా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చిన సమంతా… ఇప్పుడు సన్నిహితులతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఇప్పుడు జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది. విడాకులు చాలా బాధాకరమైన ప్రక్రియ అని చెప్పిన సమంతా… ఇప్పుడు తనకు నచ్చిన పనులు చేస్తూ ముందుకు వెళ్తుంది.
Advertisement
Advertisement
తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్లడం నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం అలాగే పార్టీలు చేసుకోవడం వరకు అన్నీ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అక్టోబర్ 2 న తన భర్తకు ఆమె విడాకులు ఇచ్చేసింది. ఇటీవల, సమంతా ఓహ్ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి సహా కొందరితో పార్టీ చేసుకుంది. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని టాక్ ఉంది.