Home » నా పిచ్చికి, బాధ‌కు మందు అదే…ఫోటో షేర్ చేసి స‌మంత ఎమోష‌న‌ల్..!

నా పిచ్చికి, బాధ‌కు మందు అదే…ఫోటో షేర్ చేసి స‌మంత ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గ‌త కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. చైతూతో విడాకుల త‌ర‌వాత స‌మంత తిరిగి సినిమాల్లో బిజీగా మారిపోయింది. పుష్ఫ‌, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ త‌ర‌వాత బాలీవుడ్ లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. వ‌రుస ఛాన్స్ లు వ‌స్తున్న స‌మ‌యంలోనే స‌మంత అరుదైన కండ‌రాల వ్యాధి మ‌యోసైటిస్ భారిన‌ప‌డ్డారు. ఇక మ‌యోసైటిస్ కోసం సమంత విదేశాల్లో సైతం చికిత్స తీసుకున్నారు.

Advertisement

య‌శోద‌ సినిమా షూటింగ్ స‌మ‌యంలో స‌మంత ఆస్ప‌త్రిలో చేర‌గా ఆ సినిమా డ‌బ్బింగ్ ను సైతం ఆస్ప‌త్రి బెడ్ పైనే పూర్తి చేశారు. య‌శోద సినిమాను విడుద‌ల చేయ‌గా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో శాకుంతలం సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్త‌వ‌డంతో స‌మంత త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పారు.

Advertisement

తాను డ‌బ్బింగ్ చెబుతున్న ఫోటో ను స‌మంత సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో కు స‌మంత ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ ఇచ్చారు. నా పిచ్చికి…బాధ‌కు ప్ర‌పంచంలో కోల్పోయినవాట‌న్నింటికి ఈ క‌ళ‌నే మందు దాని స‌హాయంతోనే నా గ‌మ్యాన్ని చేరుకుంటాను. అంటూ స‌మంత పేర్కొన్నారు. ఇక ప్ర‌స్తుతం స‌మంత ఆరోగ్య‌ప‌రిస్థితి కూడా మెరుగుప‌డిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా స‌మంత ముంబై ఎయిర్పోర్ట్ లో సూట్ వేసుకుని స్టైలిష్ గా న‌డుస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది.

More Telugu Movie News check Here

Visitors Are Also Reading