టాలీవుడ్ స్టార్ హీరోయిన్ విడాకుల తరవాత తన మీద వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ తనదైన స్టైల్ లో కౌంటర్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంత పలుమార్లు ట్రోల్స్ పై ఘాటుగా స్పందించింది. ఇక రీసెంట్ గా సమంత ఓ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్లగా ఆ ఫంక్షన్ కు ఫ్యాషన్ డ్రెస్ ను వేసుకుని వెళ్ళింది. అయితే ఆ డ్రెస్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.
Advertisement
Advertisement
డబ్బుల కోసం మరీ ఇలాంటి బట్టలు వేసుకోవాలా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే దాని పై తాజాగా సమంత తనదైన స్టైల్ లో ఘాటుగా సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చింది. మనం 2022 లో ఉన్నాం….ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా …ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు ….ఎలా కనిపిస్తున్నారు. అనేదాన్ని బట్టి స్త్రీలను అంచనా వేయడం మానేయండి. మీ అభిప్రాయాలను రుద్దడం తో ఎవరికీ మేలు జరగదు. అంటూ సమంత తన పోస్ట్ లో పేర్కొంది.