టాలీవుడ్ నటి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమా అప్డేట్ లు వర్కౌట్ వీడియోలతో పాటూ తన పెట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా తన మూడ్ ను బట్టి మోటివేషనల్ మెసేజ్ లను కూడా సామ్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే సమంత తన భర్త చైతన్యతో విడిపోతున్నట్టుగా కూడా మొదట సోషల్ మీడియా ద్వారానే బయటకు వచ్చింది.
సమంత మొదట తన సోషల్ మీడియాలో అక్కినేని అనే పేరును తొలడించడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరవాత ఆ అనుమానాలు నిజం అయ్యాయి. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే సమంత రీసెంట్ తన ఇన్స్టా గ్రామ్ లోని బయోను మార్చేసింది. ఇప్పటి వరకూ సమంత బయో బిలీవ్ అని ఉండేది కానీ ఇప్పుడు నదిలోని నీరు రాయిని చీల్చుతుంది. అంటే అది దాని శక్తి వల్ల కాదు. పట్టుదల వల్ల అంటూ బయోను పెట్టుకుంది. దాంతో సమంత తాను ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నట్టు సంకేతం ఇస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇక ఇద్దరి విడాకుల తరవాత సమంత మీడియా ముందు విడాకుల పై పెద్దగా స్పందించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎమోషనల్ పోస్ట్ లను షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే విడాకుల తరవాత అటు నాగచైతన్య ఇటు సమంత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.