సాధారణంగా సెలబ్రెటీల లైఫ్ స్టైల్ అంటేనే ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్లు ఏది వాడినా అవి టాప్ బ్రాండ్స్ అయి ఉంటాయి. టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఎంతో లగ్జరీ జీవితాన్ని గడుపుతుంటారు. ఏమాయ చేసేవే సినిమాతో సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో సమంత అందం అభినయం కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో నాగచైతన్య కంటే ఒక యేడాది పెద్ద వయసు ఉన్న అమ్మాయి గా నటించిన సమంత ఆ పాత్రలో జీవించేసింది.
Advertisement
ఆ తరవాత సమంత వరుస ఆఫర్ లు అందుకుంది. స్టార్ హీరోలు అందరితో కూడా సమంత సినిమాలు చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ స్టార్స్ పక్కన కూడా సమంత సినిమాలు చేసింది. ఇక గతేడాది డిసెంబర్ లో భర్తతో విడాకులు తీసుకున్న సమంత సినిమాల పై దృష్టిని మరింత పెంచింది. మరోవైపు సమంతకు ఉన్న క్రేజ్ తో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
Advertisement
ఇదిలా ఉంటే సమంత ఎంతో లగ్జరీ లైప్ ను గడుపుతుందన్న సంగతి తెలిసిందే. సమంత వేసుకునే బ్యాగులు…బట్టల ధరలే లక్షల్లో ఉంటాయి. అంతే కాకుండా సమంత వద్ద లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఒకటి రెండు కాకుండా సమంత వద్ద ఏకంగా ఆరు లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. కాగా ఇప్పుడు ఆ కార్ల ధర ఎంత ఆ కార్లు ఏవి అన్న సంగతి తెలుసుకుందాం.
సమంత వద్ద ఉన్న కార్లలో జాగ్వార్ ఎక్స్ ఎఫ్ కారు కూడా ఒకటి. దీని ధర రూ.72 లక్షలు ఉంటుంది. అదే విధంగా సమంత వద్ద ఆడి క్యూ 7 కారు కూడా ఉంది. ఈ కారు ధర రూ.83లక్షల పైనే ఉంటుంది. రూ. 1.46 కోట్ల స్వాంకీ పోర్చే కేమన్ కారు కూడా సమంత వద్ద ఉంది. మరోవైపు సమంత వద్ద రూ.2.26 కోట్ల రేంజ్ రోవర్ కారు కూడా ఉంది. అంతే కాకుండా సమంత వద్ద ఉన్న కార్లలో మెర్సిడీస్ బెంజ్ కారు కూడా ఉండగా దీని ధర రూ.1.42 కోట్ల వరకూ ఉంటుంది.
ALSO READ :
మహేష్ బాబు చేతిలో ఉన్న తాళాల గుత్తి కథ ఇదే..!
40 ఏళ్లు దాటిన తరవాత బిడ్డలకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్లు..!