Home » అందంగా కనిపించడం అన్నిటికన్నా కష్టమైన పని….సమంత బోల్డ్ కామెంట్స్..!

అందంగా కనిపించడం అన్నిటికన్నా కష్టమైన పని….సమంత బోల్డ్ కామెంట్స్..!

by AJAY

నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తనపై వచ్చే విమర్శలకు సమంత ఇన్ డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు. అయితే తాజాగా సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. “ఊ అంటావా మామ ఊ ఊ అంటావా” అనే పాటకు సమంత దుమ్ము లేచి పోయే రేంజ్ లో స్టెప్పులేసింది. ఈ ఐటమ్ సాంగ్ పుష్ప సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే ఈ పాట మగవాళ్ళను చులకనగా చూసేలా ఉంది అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఏకంగా పురుష సంఘాలు ఈ పాట పై కోర్టులో కేసు కూడా వేశాయి.

మరోవైపు నాగ చైతన్యను ఉద్దేశించే సమంత ఈ పాటకు స్టెప్పులు వేసింది అంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో సమంత పాటపై త్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమంత సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

‘నేను మంచి పాత్రలు చేశాను. ఫన్నీగా ఉన్నా సీరియస్ గా ఉన్నా.. చాట్ షో లో హోస్ట్ గా కూడా చేశాను. నేను చేసే ప్రతి పని ఎంతో కష్టపడి చేస్తాను. అయితే సెక్సీగా కనిపించడం అన్నింటికంటే చాలా కష్టమైన పని.” అంటూ సమంత బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇక సమంత ఈ సాంగ్ లో ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. ఇదిలా ఉండగా ఎవరు ఏం అనుకున్నా సమంత మాత్రం తనకు నచ్చినట్టు చేస్తోంది. విడాకుల తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అంతే కాకుండా విభిన్న పాత్రలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది.

Visitors Are Also Reading