Home » సమంతను ఆంటీ అంటున్న కాజల్..!

సమంతను ఆంటీ అంటున్న కాజల్..!

by Sravanthi
Ad

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. మంగళవారం నాడు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు నీల్ కిచ్లు అని పేరు పెడుతున్నట్లు కాజల్ అగర్వాల్ తెలిపింది. ఇక పుట్టిన తేదీని తెలిపేలా చిన్న కారణం ఆమె మేనల్లుడు రాక గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అభిమానులతో పంచుకుంది. నా బిడ్డ పుట్టిన రోజు నా జీవితంలో ఎంతో పరిపూర్ణమైనదని, మా ప్రపంచాన్ని ఎంతో అందంగా మార్చే మా జీవితంలో అత్యంత విలువైన మనిషికి నేను స్వాగతించానని, అత్యంత అందమైన చిరునవ్వు, అతని మెరిసే కళ్ళు మా మనసులను ప్రకాశవంతం చేశాయి. అతని చిన్న చిన్న పాదాలు, చేతులు చూస్తుంటే నా ప్రపంచం లోకి నువ్వు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము అని, ఈ మధురమైన ఘట్టానికి ధన్యవాదములు అని కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇక తన బిడ్డ నీల్ ను తన ప్రపంచంలోకి ఆహ్వానించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తొలిసారి నీల్ ఛాతి పైన పడుకున్నప్పుడు ప్రేమకు సంబంధించి ఎంతో లోతైన భావన పొందానని తెలిపింది. ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదని, ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులువైన విషయం కాదనిమూడు రోజులు తాను నిద్ర లేని రాత్రులు గడిపానని తెలిపింది.

Advertisement

బిడ్డని ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటానా అనే ఫీలింగ్ ని అనుభవించానని తెల్పింది. ఇక ఇప్పుడు బిడ్డ కలలోకి ప్రేమగా చూడడం,హత్తు కోవడంతో జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంటున్నానని తెలిపింది. అద్భుతమైన ఈ ప్రయాణాన్ని ఆనందంగా సాగిస్తున్నామని చెప్పుకొచ్చింది. బిడ్డకు జన్మనిచ్చాక ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు కానీ అందంగా మాత్రం ఉంటానని తెలిపింది. అయితే కాజల్ తల్లి అయిన సందర్భంగా ప్రతి ఒక్కరు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే సమంత కూడా విష్ చేసింది. ఇందుకు స్పందించిన కాజల్.. థాంక్యూ ఆంటీ సామ్ త్వరలోనే కలుద్దాం అంటూ కామెంట్ పెట్టింది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.

Advertisement

ALSO READ:

మెగాస్టార్ ఠాగూర్ సినిమా క్రియేట్ చేసిన ఈ రికార్డ్ మీకు తెలుసా..?

బ్రహ్మానందం కి ఏమైంది.. సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!!

 

 

Visitors Are Also Reading