స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ఏం మాయ చేసావే” సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై స్టార్ హీరోయిన్గా వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొద్ది రోజులు సినిమాలకు దూరమైంది. ఇక ఆ తర్వాత మళ్లీ కోలుకొని “ఖుషి” సినిమాలో నటించి మెప్పించారు. ఇక ఈమె అమెరికాకి వెళ్లనుంది.
Advertisement
మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం సమంత కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండనుంది. అందువల్లనే తాను ఒప్పుకున్న సినిమాలకు సైతం తీసుకున్న అడ్వాన్స్ లను తిరిగి ఇచ్చేసింది సామ్. మూడు నెలల పాటు ఈ భామ ట్రీట్మెంట్ తీసుకోనుందట. ఇక ఖుషి ప్రమోషన్స్ కు సమంత వెళ్లే అవకాశం లేదు. విజయ్ ఒక్కడే ప్రమోషన్స్ కు వెళ్లనున్నాడు. సామ్ మ్యూజిక్ ఈవెంట్ లోనే సినిమాకు కావాల్సినంత హైప్ ని తీసుకొచ్చింది. విజయ్, సమంత ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ చేయడంతో సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. పాన్ ఇండియా సినిమా కావడంతో చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లాల్సి ఉండేది సామ్. అక్కడికి కూడా సమంత వెళ్లి ఉంటే క్రేజ్ మరింత బాగా పెరిగేది.
Advertisement
దాదాపు మూడు నెలల పాటు న్యూయార్క్ లో మైయోసైటీస్ కు చికిత్స తీసుకోనుంది. దాదాపు ఈ మూడు నెలల పాటు సమంత పోస్టులు పెట్టడం తప్పితే ఏ ఈవెంట్ లోను, ప్రమోషన్స్ లోనూ కనిపించదు. ఇక మూడు నెలల పాటు ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉండదని తన స్నేహితులతో కలిసి బాలి వెళ్లి వెకేషన్ మూడ్ ని ఎంజాయ్ చేసింది. అయితే సమంత అమెరికాకు వెళ్లడం పై సోషల్ మీడియాలో వార్త సంచలనం సృష్టిస్తుంది. సమంత అమెరికాలోనే… ఓ పెద్ద ఫ్లాట్ తీసుకుందని… దాని ద్వారా కోట్లల్లో ఉందని సమాచారం. ప్రస్తుతం తన చికిత్స కోసం అమెరికా వెళ్ళింది సమంత. అందులో భాగంగానే అక్కడ ఈ భారీ ఫ్లాట్ కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.
ఇవి కూడా చదవండి
దివ్యభారతి చనిపోయి ఇంత మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందా…?
World Cup 2023 : హైదరాబాద్ లో పాకిస్తాన్ మ్యాచ్ డేంజర్ అంటున్న పోలీసులు..!
Asia Cup 2023 : టీమ్ ఇండియా ప్రకటన.. తిలక్ ఎంట్రీ.. వైస్ కెప్టెన్ గా హర్దిక్..!