టాలీవుడ్ అందాల తార సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది. ఏం మాయచేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లను తన మాయలో పడేసుకుంది. మొదటిసినిమాతోనే జెస్సీ అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఆ తరవాత స్టార్ హీరోల సినిమాలలో సమంత అవకాశాలు అందుకుంది. మహేశ్ బాబు, పవన్ కల్యాన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది.
Advertisement
ఇక స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న సమయంలోనే సమంత నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా బంధువులు సన్నిహితుల సమక్షంలో జరిగింది. అయితే నాలుగేళ్లపాటూ కలిసి మెలిసి జీవించిన ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. అయితే విడాకుల తరవాత సమంత డిప్రెషన్ లోకి వెల్లడంతో ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి వచ్చింది.
Advertisement
దాంతో సమంత చాలా కాలం పాటూ చికిత్స తీసుకుంది. సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. కాగా తాజాగా మళ్లీ సమంత సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత శాకుంతలం సినిమాలో నటించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వూలో సమంత షాకింగ్ కామెంట్ లు చేసింది.
మయోసైటిస్ నిర్దారణ కాగానే మొదట్లో చాలా బలహీనంగా అనిపించిందని చెప్పింది. యశోద షూటింగ్ సమయంలో ఆరోగ్యం క్షీణించిందని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నట్టు పేర్కొంది. అంతే కాకుండా ఆ సమయంలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఓపిక ఉండేది కాదని చెప్పింది. ఇక ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుందని….మయోసైటిస్ నుండి కోలుకున్నానని తెలిపింది.