బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవల్ లో మళ్లీ అంతటి గుర్తింపు సంపాదించుకున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా దేవిశ్రీ స్వరాలు సమకూర్చారు. కాగా సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలు కూడా ప్రాణం పోసాయి.
Advertisement
ముఖ్యంగా సినిమాలోని ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ సాగే ఐటమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాట అన్ని భాషల్లోనూ యూట్యూబ్ ను షేక్ చేసింది. కాగా తాజాగా సమంత సెర్బియాలోని ఓ పబ్ లో ఈ పాటకు రచ్చ చేసింది. సమంత వరుణ్ ధావన్ కలిసి సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో సమంత వరుణ్ ధావన్ ఉన్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే విదేశాల్లోనూ సిటాడెల్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్ కోసం సమంత వరుణ్ ధావన్ సెర్బియా కు వెళ్లారు. దాంతో సెర్బియా బెల్ గ్రేడ్ లోని ఓ పబ్ లో ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో ఊ అంటావా ఊ ఊ అంటావా అనే పాటను ప్లే చేశారు. దాంతో సమంత చేతిలో బీరు పట్టుకొని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పక్కన స్టెప్పులు వేశారు.
ఇద్దరు కలిసి స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా సమంత చేతిలో బీరు పట్టుకుని ఉండటంతో నెటిజెన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సమంత నువ్వు బీరు కూడా కొడతావా..? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ సినిమా ప్రమోషన్స్ పేరుతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ కామెంట్ పెట్టాడు.