బాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ ముందు వరసలో ఉంటాడు. 50 ఏళ్లు దాటినా సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని గడుపుతున్నాడు. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్ లతో ప్రేమయణాలు నడిపినప్పటికీ సల్మాన్ ఖాన్ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే తో సల్లు భాయ్ డేటింగ్ లో ఉన్నాడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరూ కిసీకా బాయ్ కిసీకా జాన్ సినిమాలో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. కానీ పిల్లలు మాత్రం కావాలంటున్నాడు సల్లూ బాయ్. ఇప్పుడు మా ఇంటికి కోడలిని తీసుకురావాలని ఆలోచన లేదు. కానీ ఓ పాపను తీసుకొచ్చి పెంచుకోవాలని ఉంది. కానీ మన భారతీయ చట్టాలు దాన్ని సాధ్యపడనిస్తాయో లేదో తెలియదు.
Advertisement
Advertisement
కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.. అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకూడదు కానీ నాన్నా అని పిలిపించుకోవాలని ఎదురుచూస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. మరి సల్మాన్ ఖాన్ కూడా కరణ్ ను ఫాలో అవుతున్నాడో ఏమో గానీ ఇలాంటి నిర్నయం తీసుకోవడం షాకింగ్ గా మారింది.
ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ తాజాగా కిసీకా బాయ్ కిసీకా జాన్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సినిమాలో జగపతిబాబు, వెంకటేష్, షహనాజ్, భూమిక ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ సల్మాన్ ఖాన్ సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ టైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ సల్మాన్ కు జోడీ కడుతోంది.
ALSO READ : నిన్ను చాలా మిస్ అవుతున్నా..సురేఖవాణి ఎమోషనల్…!