Home » తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎంత జీతం ఇస్తారో తెలుసా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎంత జీతం ఇస్తారో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

అనుముల రేవంత్ రెడ్డి 2006లో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా ప్రారంభించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికై విశేషమైన రాజకీయ ప్రయాణాన్ని సాగించారు. 17 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పుకోదగ్గ ప్రోగ్రెస్ ని సాధించారు. TPCC అధ్యక్షుడిగా ఉన్న రెడ్డి, 2017లో తెలుగుదేశం పార్టీ (TDP) నుండి కాంగ్రెస్‌కు మారారు. ర్టీ విజయం తర్వాత డిసెంబర్ 7న రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. కానీ, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పదేళ్ల కాలం పట్టింది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అయితే.. ఈ సారి రేవంత్ రెడ్డి సీఎం అవ్వడంతో.. ఆయనకు జీతం ఎంత ఉంటుంది అన్న విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు ప్రభుత్వం నుంచి ఎంత జీతం అందుతుంది అన్న విషయమై చర్చ జరుగుతోంది.

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్షరాలా 4. 21 లక్షల జీతాన్ని అందిస్తారట. అలాగే.. స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తికీ 4.11 జీతం అందిస్తారట. వారిద్దరికీ వాహన రుణ పరిమితి 15 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటుందట. వారికి పరిమితి లేని వైద్య సదుపాయాలు ఉంటాయట. తెలంగాణ రాక ముందు ఎమ్మెల్యేల నెల జీతం 12000 ఉండేది. ప్రస్తుతం అది ఇరవై వేలకు పెరిగింది. నియోజక వర్గానికి సంబంధించి ఇతర అలవెన్సులు 83000 నుంచి 2.3 లక్షలు ఉంటాయట. ఈ లెక్కల ప్రకారం దేశంలోని ఇతర ఎమ్మెల్యేల కంటే తెలంగాణలోని ఎమ్మెల్యేలే ఎక్కువ జీతం పొందుతున్నారని తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading