ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దేశంలోని అత్యంత ధనవంతులైన జంట. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ తన అద్భుతమైన వ్యాపారానికి మాత్రమే కాదు, అతని జీవనశైలికి కూడా ప్రసిద్ధి చెందారు. అతని స్నేహితులందరూ ప్రపంచం నలుమూలలో శక్తివంతమైన వ్యక్తులు. అతని సన్నిహితులలో బ్రిటన్ కుటుంబం నుండి అమెరికా అధ్యక్షుడు వరకు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటైన ఆంటీలియాలో నివసిస్తున్న ముఖేష్ అంబానీ, నీతా అంబానీ వారి సిబ్బందికి ఎంత జీతం ఇస్తారో తెలుసుకుందాం.
Advertisement
ముఖేష్ అంబానీ ఖరీదైన ఇల్లు ఆంటీలియా 27 అంతస్తులు ఉంటుంది. అయితే మీడియా నివేదికల ప్రకారం ఆంటీలియాలో సుమారు 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కాపలాదారు నుండి చెఫ్, డ్రైవర్ వరకు ఉన్నారు. ముకేశ్ అంబానీ తన ఇంటి సిబ్బందిని ఒక కుటుంబంలా చూసుకుంటాడు. లైవ్ మిర్రర్. కామ్ ప్రకారం, ఆంటీలియాలో పనిచేసే సిబ్బంది జీతం నెలకు 6వేల నుండి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ జీతాలను వారి పని ఆధారంగా చెల్లిస్తారు. కొన్ని మీడియా నివేదికలు కూడా 2011 సంవత్సరం వరకు సిబ్బంది జీతం 6వేల రూపాయల నుండి
Advertisement
నెలకు రెండు లక్షల రూపాయల వరకు పెరిగింది. అయితే అంబానీ కుటుంబ సభ్యులు ఎవరు ఇంతవరకు దీనిపై సమాచారం అధికారికంగా విడుదల చేయలేదు. విద్యాభత్యంతో పాటు సిబ్బంది భీమాలో ఆరోగ్య భీమాను కూడా చేర్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముఖేష్ అంబాని ఉద్యోగులలో కొంతమంది పిల్లలు అమెరికాలో చదువుతున్నారు. ఆంటీలియాలో టెండర్లను తీసుకునే ఉద్యోగుల నియామకం కోసం ప్లేస్మెంట్ ఏజెన్సీ పనిచేస్తుంది. అనేక స్థాయి ప్రమాణాలను దాటిన తర్వాత ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ ఇంటి సిబ్బంది కావడానికి అవకాశం లభిస్తుంది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !