Home » Venkatesh 75 : వెంకటేష్‌ ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ! అదిరిపోయిన ‘సైంధవ్‌’ గ్లింప్స్!

Venkatesh 75 : వెంకటేష్‌ ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ! అదిరిపోయిన ‘సైంధవ్‌’ గ్లింప్స్!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ 61 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకీకి పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. వెంకీ తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కాగా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ రూట్ మార్చాడు. ఇప్పుడు యాక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాడు.

Advertisement

ఫ్యామిలీ సినిమాలతో అలరిస్తున్న వెంకీ మామ ఇప్పుడు రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఆ సినిమా టైటిల్ ని ప్రకటించారు. హిట్ ఫెమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైందవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర టైటిల్ ని, ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన చంద్రప్రస్త అనే ఓడరేవు ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి బైక్ పై ఉన్న ఓ బాక్స్ ని ఓపెన్ చేశాడు.

Advertisement

అందులో మెడిసిన్ వైల్ ఉంది. అది తీసుకుని కంటైనర్ లోపలికి వెళ్లిన వెంకీ ఓ గన్ పట్టుకుని బయటకు వచ్చారు. భారీ తుపాకీని పట్టుకుని ముందు పడిపోయిన విలన్లలో ‘నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికి వెళ్ళను, రమ్మను’ అంటూ వెంకి వార్నింగ్ అదిరిపోయేలా ఉంది. ఆయన లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉండటం విశేషం. కొద్దిగా గడ్డంతో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు. వెంకటేష్ సైందవ్ ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇది వెంకటేష్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

READ ALSO : Pathaan Movie Review : “పఠాన్” మూవీ రివ్యూ

 

Visitors Are Also Reading