Home » “సైంధవ్” సినిమాలో ఆ చివరి 20 నిముషాలు వేరే లెవెల్.. ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్!

“సైంధవ్” సినిమాలో ఆ చివరి 20 నిముషాలు వేరే లెవెల్.. ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్!

by Srilakshmi Bharathi
Ad

విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్ ఈ శనివారం గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెరేమియా, రుహాని శర్మ, ఆర్య, జయప్రకాష్ మరియు ఇతర నటీనటులు ఉన్నారు.

Advertisement

తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శైలేష్ ఇలా పోస్ట్ చేసారు. “నేను మీతో ఓ విషయాన్నీ పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయాన్నీ నేను చాలా వినయంగా, హృదయపూర్వకంగా చెబుతున్నాను. సైంధవ్ యొక్క చివరి 20 నిమిషాలు చూడగలిగిన వారి జీవితంలో ఆ సమయం ఓ అత్యుత్తమ అనుభవంగా మిగిలిపోతుంది. మరియు ఇది కేవలం నా హీరో వెంకటేష్ వల్లనే సాధ్యమైంది. దర్శకుడికి తన సినిమాపై ఎంత నమ్మకం ఉందో ఈ మాటలు తెలియజేస్తున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్ నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు.

Advertisement

సైంధవ్ కోనేరు అలియాస్ “సైకో” తన భార్య మనోగ్య మరియు కుమార్తె గాయత్రితో కలిసి గడుపుతున్న వ్యక్తిగా ఈ సినిమాలో వెంకటేష్ కనిపిస్తారు. గాయత్రికి వెన్నెముక కండరాల క్షీణత ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు అతని జీవితం అనుకోని టర్న్ తిరుగుతుంది. అందుకోసం జోలీజెన్స్మ ఇంజెక్షన్ అవసరం, దీని ధర ₹17 కోట్లు. గాయత్రి యొక్క ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించడానికి సైకో తిరిగి మాఫియా ప్రపంచానికి వెళ్తాడు. తిరిగి పోరాటాన్ని చేస్తాడు. వారిలో క్రూరమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ మాలిక్ తో హీరో ఎలా ఫైట్ చేసాడు? తన భార్యని దక్కించుకున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading