Home » నల్లగా ఉన్నానని మొదట భయపడిన సాయి పల్లవి..స్టార్ హీరోయిన్ ఎలా అయ్యిందో తెలుసా..?

నల్లగా ఉన్నానని మొదట భయపడిన సాయి పల్లవి..స్టార్ హీరోయిన్ ఎలా అయ్యిందో తెలుసా..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలగాలి అంటే చాలావరకు కమర్షియల్ సినిమాలో హీరోయిన్లకు దోహదపడుతూ ఉంటాయి. కమర్షియల్ మూవీలలో హీరోయిన్లకి నటించడానికి పెద్దగా స్కోప్ లేకపోయినా స్టార్ హీరోల పక్కన నటించడంతో ఆ తక్కువ నిడివి ఉన్న పాత్రలతోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటు ఉంటారు. అలాగే కొంతమంది అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటారు. అలా అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్న వారికి విజయాలు కూడా దక్కినట్లు అయితే అలాంటి వారు కూడా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల స్థానానికి వెళ్లిపోతూ ఉంటారు.

Advertisement

ఇలా కాకుండా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ… అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ కేవలం కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ వచ్చే ముద్దుగుమ్మలు చాలా తక్కువ శాతం మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదుగుతూ ఉంటారు. అలా కమర్షియల్ సినిమాలకు… గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగిన వారిలో సాయి పల్లవి ఒకరు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ… నేను చిన్నతనం నుండి సిమ్రాన్… త్రిష లాంటి హీరోయిన్లను చూస్తూ పెరిగానని వారి లాంటి బాడీ స్ట్రక్చర్… అందం… గ్రామర్ నాకు లేవు అని బాధపడేదాన్ని అని … నేను కొంత కాలం జార్జియాలో ఉన్నాను. అక్కడి వాళ్లంతా తెల్లగా ఉంటారు. నాకు అంతటి తెల్లదనం లేదు అని… నేను నల్లగా ఉంటాను అని… నన్ను ఎవరు పెద్దగా ఇష్టపడరు అని అనుకునే దానిని. అలాంటి సమయంలోనే నాకు మలయాళ ప్రేమమ్ మూవీలో ఆఫర్ వచ్చింది.

డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టుగా చేశాను. ఆ సినిమా విడుదల సమయానికి నేను మళ్లీ జార్జియా కు వెళ్ళిపోయాను. సినిమా విడుదల రోజు నన్ను అందరూ తిడతారు… ఈ పింపుల్స్ మొహాన్ని చూడడం ఏంటి అని అంటారు అనే బాధతో నేను సోషల్ మీడియా కూడా ఓపెన్ చేయలేదు. కానీ చివరకు ఆ సినిమాలో నా నటనను… నా అందాన్ని చాలా మంది పొగిడారు అని సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading