Home » Sai Pallavi : హీరోల కంటే సాయిపల్లవికి ఎక్కువ రెమ్యూనరేషన్‌..ఒక్కో సినిమాకు 3 కోట్లు ..!

Sai Pallavi : హీరోల కంటే సాయిపల్లవికి ఎక్కువ రెమ్యూనరేషన్‌..ఒక్కో సినిమాకు 3 కోట్లు ..!

by Bunty
Ad

నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన చిత్రం “లవ్ స్టోరీ”. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాస్త అటు ఇటుగా ఈ సినిమాపై టాక్ వచ్చినప్పటికీ మ్యూజికల్ పరంగా ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్, కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి తాజాగా మరొక చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే చైతన్య నార్త్ మీడియాతో మాట్లాడుతూ…. మనసుకు దగ్గరైన వారందరూ “తండెల్” సినిమాలో ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.

Sai Pallavi gets more remuneration than heroes

Sai Pallavi gets more remuneration than heroes

అంతేకాకుండా సాయి పల్లవితో నటించడం చాలా సంతోషంగా ఉందని…. నేను, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలో నటించడం కన్నా ముందే సాయి పల్లవి నటించిన మలయాళ వర్షన్ ప్రేమమ్ సినిమాని చైతన్య చూశారట. అందులో పల్లవి నటన అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత సాయి పల్లవితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. చందు మొండేటి దర్శకత్వంలో నటించడం తనకేమీ కొత్త కాదంటున్నాడు చైతన్య.

Advertisement

తాను ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ నీ ఈ సినిమాలో చేశానని చెప్పుకొచ్చాడు. మత్స్యకారుల లైఫ్ స్టైల్ ని అర్థం చేసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా వచ్చిందని కామెంట్స్ చేశారు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటించినందుకు భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దాదాపు ఈ సినిమాలో నటించినందుకు రూ. 3 కోట్ల మేర డిమాండ్ చేసినట్లు సమాచారం అందుతుంది. దీనికి నిర్మాతలు సైతం ఓకే చెప్పారట. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading