టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ పాత్రలతో బయపెట్టిన నటుడు నూతన్ ప్రసాద్. విలన్ గానే కాకుండా కమడియన్ గా కూడా నూతన్ ప్రసాద్ ప్రేక్షకులను నవ్వించగలిగారు. ముక్యంగా ఆయన వాయిస్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాల్లో రాణించడానికి కూడా ఆయనకు వాయిస్ ఎంతో ప్లస్ అయ్యిందని చెబుతుంటారు. నూతన్ ప్రసాద్ దాదాపు 30 సంవత్సరాల వరకు సినిమాల్లో నటించి ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు.
Advertisement
ఆయన కెరీర్ లో మొత్తం నాలుగు నంది అవార్డ్ లను అందుకున్నారు. విలన్ గా కమెడియన్ గా నూతన్ ప్రసాద్ వంద చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు. వరుస సినిమాలో బిజీగా ఉన్న నూతన్ ప్రసాద్ జీవితంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటనతో జీవితం మొత్తాన్ని అందకారంలోకి నెట్టివేసింది. 1989 సంవత్సరంలో రాజేంద్రప్రసాద్ హీరోగా బామ్మ మాట బంగారు బాట అనే సినిమా తెరెక్కించింది.
Advertisement
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ప్రమాదం జరగ్గా ఆ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. షూటింగ్ కారును జేసీబీతో పైకెత్తే సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో కారుకు కట్టిన చైన్ తెగిపోయింది. దాంతో ఒక్కసారిగా కారు గాల్లో నుండి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో నూతన్ ప్రసాద్ వెన్నుముక విరిగిపోయింది.
దాంతో ఆయన వీల్ చేర్ కు పరిమితం అయ్యారు. జీవితంలో ఎప్పుడూ ఆగిపోకూడదు అన్న సూత్రాన్ని నూతన్ ప్రసాద్ దగ్గర నుండి కూడా నేర్చుకోవచ్చు. అంతటి ప్రమాదం జరిగి వీల్ చేర్ కు పరిమితం అయినా కూడా ఆయన సినిమాల్లో నటించారు. అయితే ఫుల్ టైమ్ కాకుండా అతిధి పాత్రల్లో నటించి మెప్పించారు. అంతే కాకుండా నేరాలు గోరాలు టీవీ షోకు వాయిస్ ఓవర్ ఇచ్చి అలా కూడా ప్రశంసలు అందుకున్నారు.