Sabari review: విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ అందరినీ ఆకట్టుకుంటూ వుంటారు వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు, తమిళ భాషల్లో కూడా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆమె హీరోయిన్‌గా సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది ఈ సినిమా.
సినిమా: శబరీ
నటీ నటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, గణేష్ వెంకట్రామన్, బేబీ నివేక్ష తదితరులు
దర్శకత్వం: అనిల్ కాట్జ్
రిలీజ్ డేట్: మే 3, 2024
Advertisement
కథ మరియు వివరణ:
సంజన (వరలక్ష్మి శరత్‌కుమార్) చాలా ధైర్యం వున్న ఆమె. పెద్దలను ఎదురించి అరవింద్‌ను (గణేష్ వెంకట్రామన్) పెళ్లి చేసుకుంటుంది. అరవింద్ జీవితంలో ఇంకో అమ్మాయి ఉందని తెలిసి భర్తకు దూరంగా కూతురు రియాతో (బేబీ నివేక్ష) వైజాగ్ వెళ్ళిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా డిగ్రీ కూడా లేకపోవడంతో జాబ్ ఇవ్వరు. కాలేజీ ఫ్రెండ్, లాయర్ రాహుల్ (శశాంక్) హెల్ప్ తో జుంబా ట్రైనర్‌గా జాబ్ వస్తుంది. సంజన ఆచూకీ కోసం సూర్య (మైమ్ గోపీ) అనే క్రిమినల్ వెతుకుతాడు. సంజన వైజాగ్‌లో ఉందని తెలుస్తుంది. సూర్య బారి నుంచి తనతో పాటు కూతురిని కాపాడుకోవడానికి పోలీసులకి చెప్తుంది. పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో సూర్య చనిపోయినట్లు తెలుస్తుంది. సంజన మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలుసుకుంటారు. అసలు సూర్య ఎవరు..? నిజంగానే సూర్య చనిపోయాడా..? సంజన గతం ఏమిటి…? భర్త అరవింద్ నుంచి సంజన ఎందుకు దూరమైంది..? ఇవన్నీ తెలియాలంటే శబరి చూడాలి.
Advertisement
కూతురిని కాపాడుకోవడానికి ఓ తల్లి సాగించిన పోరాటం నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ శబరి కథను రాసుకున్నాడు. సాధారణంగా తల్లీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ముడిపడిన కథలు సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంటాయి. కానీ అనిల్ కాట్జ్ మాత్రం సైకలాజికల్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా శబరి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ లో కొన్ని ట్విస్ట్‌లను సర్‌ప్రైజింగ్‌గా వున్నాయి. కూతురి కోసం తల్లి పడే ఆరాటం తో అద్భుతంగా సినిమాని నడిపించారు. ఫస్ట్ హాఫ్‌ను నెమ్మదిగా ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం స్క్రీన్‌ప్లే సూపర్బ్. సూర్య, శబరి పాత్రలకు సంబంధించి రివీలయ్యే ట్విస్ట్‌లు కూడా సూపర్బ్.
ప్లస్ పాయింట్స్:
కథ
కాన్సెప్ట్
వరలక్ష్మి నటన
ట్విస్టులు
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా సీన్స్
Rating: 2.5/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!