Home » క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ జీవితంలో ఇంత‌టి విషాద‌ముందా..!

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ జీవితంలో ఇంత‌టి విషాద‌ముందా..!

by AJAY
Ad

టాలీవుడ్ లో కామెడీని పండించే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు మాస్ట‌ర్ భ‌రత్. ఇప్పుడు మాస్ట‌ర్ భ‌ర‌త్ కూడా పెద్ద‌వాడు అయిపోయినా ఒక‌ప్పుడు భ‌ర‌త్ చేసిన కామెడీ సీన్ల‌కు ఇప్ప‌టికీ ఎంతో క్రేజ్ ఉంది.

Advertisement

చూడ్డానికి బొద్దుగా కనిపిస్తూ భ‌ర‌త్ యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసేవాడు. రెడీ సినిమాలో చిట్టి నాయుడు పాత్ర‌లో న‌టించి క‌డుపుబ్బా న‌వ్వించాడు. కానీ కొంత వ‌య‌సు వ‌చ్చాక భ‌ర‌త్ సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యాడు.

కానీ మళ్లీ హీరో క‌టౌట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక భ‌ర‌త్ పెద్ద‌య్యాక హీరో అవ్వాల‌ని అనుకున్నాడు. అందుకోసం అప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించే బ‌రువును త‌గ్గించుకోవాల‌ని ఎంతో క‌ష్టప‌డ్డాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు జ‌రిగిన ఓ న‌ష్టాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో భ‌ర‌త్ వెల్ల‌డించారు. బ‌రువు త‌గ్గ‌టం కోసం తాను ఎన్నో క‌ఠిన‌మైన వ్యాయామాలు చేసాన‌న‌ని భ‌ర‌త్ చెప్పాడు.

Also Read: సూప‌ర్ స్టార్ కృష్ణ కోసం ఎన్టీఆర్ జీవితాంతం త్యాగం.. ఏమిటంటే..?

Advertisement

అలా వ్యాయామం చేస్తున్న స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదం వ‌ల్ల త‌న కుడిక‌న్ను పోయింద‌ని చెప్పారు. జిమ్ చేస్తున్న సమ‌యంలో రాడ్ కు ఉన్న స్ప్రింగ్ వ‌చ్చి క‌న్నుకు త‌గ‌ల‌టంతో తాను చూపును కోల్పోయిన‌ట్టు తెలిపాడు. అంతే కాకుండా సినిమాల‌లో న‌టిస్తూ త‌న చ‌దువును ఎప్పుడూ కూడా ప‌క్క‌న పెట్ట‌లేద‌ని తెలిపారు. తాను మెడిసిన్ పూర్తి చేసిన‌ట్టు భ‌ర‌త్ వెల్ల‌డించారు.

కాలేజీ రోజుల‌లో త‌న‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉండేద‌ని చెప్పాడు. చాలా మంది అమ్మాయిలు త‌న‌కు ప్ర‌పోజ్ చేశార‌ని భ‌ర‌త్ వెల్ల‌డించారు. ఎంత మంది త‌న‌కు ప్ర‌పోజ్ చేసిన‌ప్ప‌టికీ తాను త‌ల్లి చాటు బిడ్డ‌నే అంటూ స్ప‌ష్టం చేశాడు. ఇదిలా ఉండ‌గా భ‌ర‌త్ ఏబీసీడీ సినిమాలో సెకండ్ హీరోగా న‌టించాడు. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు. త్వ‌ర‌లో మ‌రికొన్ని చిత్రాల‌తో ముందుకు రాబోతున్నాడు.

Also Read: ఇండియాలో త్వ‌ర‌లో ఫోర్త్ వేవ్…75శాతం మందిపై ప్ర‌భావం…?

Visitors Are Also Reading