వివాహం జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎవరి ఆచారం ప్రకారం వారు వివాహం చేసుకుంటారు. భారత దేశంలో సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వివాహం జరుగుతుంది. మనదేశ యువత పాశ్చాత్య పోకడలతో విదేశీ సంప్రదాయాల మత్తులో జోగుతున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను గంగలో తోసేస్తున్నారు.
అయితే, కొంతమంది విదేశీయులు భారత దేశానికి వచ్చి ఇక్కడి సంప్రదాయాలను చూసి మెచ్చుకొని ఇక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక, భారత దేశానికి చెందిన అమ్మాయిలను, అబ్బాయిలను వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, జర్మనీకి చెందిన అబ్బాయి, రష్యాకు చెందిన అమ్మాయి వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఆ ఇద్దరూ ఇండియాకు వచ్చి హిందు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఉన్న మక్కువతో ఇలా వివాహం చేసుకున్నట్టుగా జూలియా, క్రిస్ ముల్లర్‌లు పేర్కొన్నారు. క్రిస్ ముల్లర్ వ్యాపారవేత్త. జర్మనీలో బిజినెస్ చేస్తున్నాడు. అడాల్ఫ్ హిట్లర్ కాలం నుంచి జర్మనీలో హిందు సంప్రదాయాలను పాటించేవారు ఉన్నారు. ఇక రష్యా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రష్యాలో భారతీయులు లక్షలాది మంది నివశిస్తున్నారు.
Advertisement