Home » “నా అన్వేషణ”కు రూ.5 కోట్లు ఇచ్చిన నారా లోకేష్….?

“నా అన్వేషణ”కు రూ.5 కోట్లు ఇచ్చిన నారా లోకేష్….?

by Bunty
Ad

తెలుగు యూట్యూబర్లలో అత్యధికమంది పాలోవర్లను సంపాదించుకున్న వారిలో నా అన్వేషణ ఒకరు. ఇతను యూట్యూబ్ లలో ప్రస్తుతం మొదటి ప్లేస్ లో నిలుస్తున్నారు. ఇతను ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అక్కడి విశేషాలను, అద్భుతాలను వీడియో రూపంలో ప్రేక్షకులకు చూపిస్తూ ఉంటాడు. తాను చేసే వీడియోలకి ఎంతోమంది ఫాన్స్ ఫిదా అవుతారు.

Advertisement

తాజాగా అన్వేష్ కొన్ని రోజుల క్రితం ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపణలకు దారితీస్తోంది. తాజాగా జింబాబ్వే వెళ్లి వీడియో చేసిన అన్వేష్ అక్కడి దేశ పరిస్థితులను, ఇక్కడ వాటితో పోలుస్తూ వీడియో చేశాడు. అందులో భాగంగానే ఉచిత సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గూర్చి వివరించాడు. ఇందులో ఏ రాజకీయ నాయకుడి పేరును ప్రస్తావించకపోయిన వీడియో మాత్రం వైరల్ అయింది. ఈ వార్తపై ఓ ప్రముఖ దినపత్రికలో వార్త కూడా వచ్చింది.

Advertisement

ఇది టిడిపి వాళ్ళు చేయిస్తున్న వీడియో అంటూ, అంతేకాకుండా ఈ వీడియో చేసినందుకు నారా లోకేష్ అతనికి ఐదు కోట్లు ఇచ్చారు అంటున్నారు. ఈ వార్తపై నారా లోకేష్ స్పందించారు. ఆ వార్త ఫేక్ అంటూ కొట్టి పారేశారు. ఇంకెంత దిగజారుతారు అంటూ వైసీపీని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర పరిస్థితుల గురించి, భవిష్యత్తు గురించి ప్రశ్నించిన నా అన్వేషణ ఛానల్ ను అభినందించాల్సిందే అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading