సింగర్ సునిత సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. 3.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉండడంతో బ్యూటిపుల్ సింగర్ సునిత పోస్టులను తెగ లైక్ చేస్తూ ఉంటారు. చాలా వరకు ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతుంటారు. ఇటీవలే సునిత అందాన్ని పొగుడుతూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు స్వయంగా అతని భార్యనే రిప్లై ఇవ్వడంతో ఆ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయింది.
Advertisement
టాలీవుడ్ సింగర్ సునిత తల్లి కాబోతుందని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఇటీవల సునిత సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. తమ ఫార్మ్ హౌస్లో మామిడి చెట్టు వద్ద కూర్చొని మామిడి కాయలను చూపిస్తూ.. ఫోజు ఇచ్చిన సునిత క్యాప్షన్ గా బ్లెస్ట్ అంటూ రాసుకొచ్చింది. అది చూసిన వారందరూ ఆమె మరొకసారి తల్లికాబోతుంది అని అనుకోని ఆమెకు విషెస్ చెప్పడం ప్రారంభించారు.
Advertisement
తాజాగా ఈ వార్తలపై సింగర్ సునిత స్పందించింది. దేవుడా జనాలు ఇంత క్రేజీగా ఉన్నారేంటి. మామిడి కాయలతో ఫోటో దిగి పోస్ట్ చేస్తే ఏదేదో ఊహించుకుని రాసేశారు. దయచేసి ఇలాంటి పుకార్లు ప్రచారం చేయకండి. మీకొక దండం రా నాయనా.. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సునిత తల్లి కాబోతుందనే వార్తలకు చెక్ పడినట్టు అయింది. ఇకపోతే సునిత బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకున్న విషయం విధితమే.
Also Read :
వంట చేసినప్పుడు మీ చెయ్యి కాలితే ఇలా అస్సలు చేయకండి..!
అధికంగా షుగర్ ఉన్న వాళ్ళు సమ్మర్ లో ఏ పండ్లు తినాలంటే.!!