Home » అధికంగా షుగర్ ఉన్న వాళ్ళు సమ్మర్ లో ఏ పండ్లు తినాలంటే.!!

అధికంగా షుగర్ ఉన్న వాళ్ళు సమ్మర్ లో ఏ పండ్లు తినాలంటే.!!

by Sravanthi Pandrala Pandrala

షుగర్ ఉన్న వారికి తీపి పదార్థాలపై మరింత ఇష్టం పెరుగుతుంది. ఏది తినవద్దో ఆ ఫుడ్ ఎక్కువగా తినాలి అనిపిస్తుందట. కానీ కొంతమంది షుగర్ పేషెంట్లు ఏం తినాలో ఏం తినకూడదో తెలియక ఆలోచిస్తూ ఉంటారట. షుగర్ ఉన్న వారు ఏ పండ్లు తినవచ్చు.. ఏ పండ్లు తినకూడదో ఓ సారి చూద్దాం..!!

యాపిల్ : ఆపిల్ పండు ప్రతిరోజు తింటే రోగాలు మన దరిచేరవు అంటారు డాక్టర్లు. యాపిల్ లో ఉండే ఫైబర్ విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పెప్టిన్ అనే రసాయన ఉండటంవల్ల రక్తంలోని చక్కెరను సగానికి తగ్గిస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఆపిల్ తినడం మంచిది.

పుచ్చకాయ : అధికంగా వాటర్ సోర్స్ ఉండే పండు. ఇది ఎండాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లకు పుచ్చకాయ విషయంలో భయం అక్కర్లేదట. పుచ్చకాయ లో అధికంగా నీటిశాతం ఉండటమే కాకుండా పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తింటే వెంటనే గ్లూకోజ్ పెరిగి మళ్లీ తగ్గిపోతుంది. దీన్ని షుగర్ వ్యాధిగ్రస్తులు తింటే మంచిది.

దానిమ్మ : దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు మరియు ఐరన్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే షుగర్ నియంత్రణలో ఉంటుంది.

నిమ్మకాయ : ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

జామకాయ : షుగర్ వ్యాధిగ్రస్తులకు జామ అనేది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావల్సిన శక్తిని ఇస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీ తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ALSO READ :

వంట చేసిన‌ప్పుడు మీ చెయ్యి కాలితే ఇలా అస్స‌లు చేయ‌కండి..!

 

బేకరీలకు ” బెంగళూరు ” “అయ్యంగార్” అని పేరు ఎందుకు పెడతారు.. దీనికి ఇంత చరిత్ర ఉందా..!!

 

Visitors Are Also Reading