ఏటీఎం మిషన్ అనే పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేంది డబ్బులు. అయితే, మీకు ఏటీఎంలో ఎప్పుడైనా ఎంటర్ చేసిన అమౌంట్ కంటే, ఎక్కువ డబ్బులు వచ్చాయా? అలా జరిగి ఉండదులే. కానీ ఓ వ్యక్తి రూ. 500 తీసుకుందామని వెళ్తే, రూ.2500 వచ్చాయి. అంటే ఐదు రెట్లు అధికంగా డబ్బు పొందాడు. అంతే ఆ ఏటీఎంకు వందలాదిగా క్యూ కట్టారు జనం. ఇది ఎక్కడ జరిగిందనే విషయాల్లోకి వెళ్తే, పాత బస్తిలోని ఓ ఏటీఎం నుంచి నోట్ల వర్షం కురుస్తోంది.
Advertisement
మొహల్పురలోని ఇశ్రత్ మహల్ లో ఉన్న హెచ్ డి ఎఫ్ సి ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రూ.500 కొడితే, రూ. 2500 వస్తున్నాయి. దీంతో ఏటీఎం దగ్గర జనాలు భారీగా క్యూ కట్టారు. ఏటీఎం నుంచి రూ. 500 కొట్టి, రూ. 2500 పట్టుకెళ్తున్నారు. హరిబౌలీ చౌరస్తాలోని హెచ్డిఎఫ్సి ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
Advertisement
అప్పటికే విషయం తెలుసుకొన్న స్థానికులు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు వచ్చి రూ. 500 డ్రా చేస్తే, రూ.2500 వస్తున్న విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఏటీఎం కేంద్రాన్ని మూసివేయించి బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. సరిగ్గా ఇలాంటి సంఘటన మరొకటి గతంలో జరిగింది. ఏటీఎంలో 500 రూపాయలు కావాలని ఎంటర్ చేస్తే అంతకు ఐదురేట్లు ఎక్కువ డబ్బు వచ్చిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అవుతుంది. ఇంతలోనే హైదరాబాద్ లో అచ్చం ఇలాగే చోటు చేసుకుంది.
READ ALSO : జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ క్లియర్ చేసిన సురేష్ బాబు…వీడియో వైరల్