Home » ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ డేట్ వచ్చేసింది ..

ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ డేట్ వచ్చేసింది ..

by Bunty
Published: Last Updated on
Ad

అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ ఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు .ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి .డిసెంబర్ 9న ట్రైలర్ రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు . ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సంక్రాంతి 7 ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .ఈ సినిమా ప్రమోషన్స్ ను ఒమిక్రాన్ వేరియంట్‌ ప్రభావం లేకుంటే దుబాయ్ లో నిర్వహించాలని ప్లాన్ చేశారు .

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదల కానుంది .ఈ సినిమాలోని రిలీజైన మూడు పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. జనని , దోస్త్, నాటు నాటు పాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి .నాటు నాటు పాట అయితే ఓ రేంజ్ లోఅభిమానులను అలరిస్తుంది .ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్‌, ఆలియాభట్‌, శ్రీయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు .బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వీరవిహారం చేయడం ఖాయం గా కనిపిస్తుంది . రాజమౌళి మేకింగ్ ఈ సినిమా పై దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసింది .ఈ సినిమా డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు . సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు .ఈ మల్టీ స్టారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు అభిమానులు ఆగక తప్పదు .

Advertisement

Visitors Are Also Reading