Home » ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్.. ఎప్పటినుంచి అంటే..?

ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్.. ఎప్పటినుంచి అంటే..?

by Sravanthi
Ad

దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో విడుదలై సంచలనం సృష్టించిన మూవీ ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన టువంటి ఈ మూవీలో వీరిద్దరి నటన చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపోవు. వీళ్ల కుస్తీనీ చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇంతటి అద్భుత కళా ఖండంకి ఆజ్యం పోసిన దర్శక ధీరుడు రాజమౌళి సినిమాను మన ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీ నిర్మాణానికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు. మార్చి 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై

Advertisement

Advertisement

 

ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక ఈ మూవీ గురించి ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓటిటీ ద్వారా రిలీజ్ ఎప్పుడుఎప్పుడు అవుతుందా అని ఎంతో మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళం, కన్నడం మలయాళం, తెలుగు వర్షంలో జీ 5 భారీగా డీలును సొంతం చేసుకోగా హిందీ మరియు విదేశీ భాషల వెర్షన్లను నెట్ ఫిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల ఆసక్తికర అప్డేట్ నెట్టింటా చక్కర్లు కొడుతోంది. అయితే ఆర్ఆర్ మూవీ జూన్ 3

నుండి జీ 5లో ప్రసారం కానుందని, హిందీ మరియు విదేశీ భాషల వెర్షనును నెట్ ఫ్లిక్స్ అదేరోజు లేకుంటే జూన్ 2వ వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుత కాలంలో ఏ మూవీ అయినా రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీ లోకి వస్తున్నాయి. కానీ త్రిబుల్ ఆర్ మూవీ మాత్రం విడుదలైన రెండున్నర నెలల తర్వాత ఓటీటీ లోకి రావడం విశేషం. అయితే త్రిబుల్ ఆర్ మూవీ జూన్ 3 నుంచి జీ 5లోకి వస్తుందా.. లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..!

 

Visitors Are Also Reading