రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వేల కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటించారు. అలియా భట్ ఈ సినిమా లో రామ్ చరణ్ కు హీరోయిన్ గా నటించగా ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Advertisement
ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తమ నటన తో ప్రేక్షకులను మెప్పించారు. హీరోలు గా నటించిన చరణ్, ఎన్టీఆర్ ఆయితే స్టార్ హీరోల మాదిరిగా కాకుండా గొప్ప నటులుగా కనిపించారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో విడుదలకు ముందు నుండి వారి పాత్ర పై అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఇద్దరి పాత్రలను రాజమౌళి బ్యాలెన్స్ చేసాడా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
Advertisement
అయితే ముందుగా ప్రేక్షకులు ఊహించినట్టే ఎన్టీఆర్ పాత్ర ప్రాధాన్యత తగ్గటం తో అభిమానులు నిరాశ చెందారు. తమ హీరోకు సినిమాలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను హైలెట్ చేసే సీన్లు చాలా తక్కువగా ఉన్నాయని రామ్ చరణ్ ను ఎక్కువ హైలైట్ చేశారని బాధపడుతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సీన్లను కూడా డిలీట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి
ఇంటర్వెల్ తర్వాత ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక సీన్ రావాల్సి ఉందట కానీ ఆ సీన్ థియేటర్ ప్రింట్ లో డిలీట్ చేశారని తెలుస్తోంది. కొమరం భీమ్ ప్రామిస్ చేస్తూ ఒక సీన్ ఉండేదట…. ఈ సీన్ ను కూడా ఫైనల్ అవుట్ పుట్ లో కనిపించలేదని సమాచారం. అంతేకాకుండా కొమరం భీమ్ జైలులో ఉన్నప్పుడు క్లైమాక్స్ లో టర్బన్ లుక్ లో ఓ సన్నివేశాన్ని కూడా థియేటర్ వర్షన్ నుంచి డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. అలా ఎన్టీఆర్ నటించిన చాలా సన్నివేశాలు తొలగించడం వల్లే అతడికి ప్రాధాన్యత తగ్గిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read : టాప్ యూట్యూబర్ విక్రమాదిత్య ఎవరో తెలుసా..? అతడి బ్యాగ్రౌండ్ ఏంటంటే..!