Ad
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే బాహుబలి తరువాత రాజమౌళి నుండి సినిమా అనేది రావడానికి చాలా సమయం పట్టింది. అయితే ఈ ఏడాది రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఏంటో ఎదురు చూసారు.
అందుకు కారణం ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు సూపర్ స్టార్ ఉన్నారు. అయితే అంచనాలకు తగ్గిన విధంగానే ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియా లో సూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 1100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ అనేవి అందుకొని బంపర్ హిట్ అయింది. అయినా కూడా ఆర్ఆర్ఆర్ హిట్ అనేది ఇంకా తగ్గలేదు. అయితే ఆర్ఆర్ఆర్ వచ్చిన క్రేజ్ చూసి.. ఈ సినిమాను ఈ నెల 21న జపాన్ లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే జపాన్ లో కూడా మన తెలుగు సినిమాకు మంచి ఆదరణ లభించింది అనే చెప్పాలి. ఇక తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన మొదటి రోజే కోటి రూపాయలకు పైగా వసూల్ చేసిన ఆర్ఆర్ఆర్.. జపాన్ లో ఈ ఫిట్ అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది. ఇక తాజాగా విడుదలైన వారం రోజులో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ 10 సినిమాల్లోకి వచ్చింది. ఇందులో మొదట 9 స్థానాల్లో జపాన్ సినిమాల్లే ఉండగా.. 10వ స్థానంలోకి ఆర్ఆర్ఆర్ వచ్చి చేరింది.
ఇవి కూడా చదవండి :
బాబర్ కెప్టెన్ గా ఉంటె పాకిస్థాన్ పతనం పక్కా..!
కోహ్లీ ఇన్నింగ్స్ క్రికెట్ భగవద్గీత..!
Advertisement