Home » RRR హీరోయిన్ ఒలివియా మోరిస్ బాయ్ ఫ్రెండ్ ఎవరు….? అతడి బ్యాగ్రౌండ్ ఏంటి..?

RRR హీరోయిన్ ఒలివియా మోరిస్ బాయ్ ఫ్రెండ్ ఎవరు….? అతడి బ్యాగ్రౌండ్ ఏంటి..?

by AJAY
Ad

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ నటించగా ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ముందు నుంచి ఒలీవియా మోరిస్ పాత్ర పై ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలు లేవు.

Advertisement

బాలీవుడ్ నటి అలియా భ‌ట్ ఇప్ప‌టికే ప్రేక్షకులకు పరిచయం ఉండటంవల్ల అందరూ ఆమె పైనే ఎక్కువ ఫోకస్ చేశారు. అంతేకాకుండా అలియా భట్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. అయితే అందరూ ఆలియాభట్ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అనుకుంటే సినిమాలో ఒలివియా మోరీస్ ఆమె పాత్రను డామినేట్ చేసింది.

Advertisement

ప్రేక్షకులకు ఒలివియా మోరిస్ నటించిన జెన్నీ పాత్ర నచ్చడంతో ఆమెను మరిన్ని సినిమాల‌లో చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా జెన్నీ బ్రిటిష్ యువరాణిగా క్యూట్ స్మైల్ తో కట్టిప‌డేసింది. అయితే ఒలివియా బ్రిటిష్ నటి కాగా ఆమె లండన్ లో జన్మించింది. హాలీవుడ్ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల‌లో నటించి అభిమానులను సంపాదించుకుంది.

ఇక ఒలివియా వయసు 25 కాగా ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. రీసెంట్ ఇంటర్వ్యూ ల‌లో తన బాయ్ ఫ్రెండ్ కు సినిమా నచ్చిందని నాటు నాటు పాటకు డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాడ‌ని చెప్పింది. ఇక ఒలివియా బాయ్ ఫ్రెండ్ పేరు జాక్ హమ్మెట్ కాగా అతడు కూడా థియేటర్ ఆర్టిస్ట్. గత ఐదేళ్లుగా వీరు డేటింగ్ లో ఉన్నారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం ఒలివియా జాక్ ఫోటోలు వైరల్ అవ్వడం తో ఆమె ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు.

Also Read: చిరు, మహేష్, రిజెక్ట్ చేసిన స్టోరీ లో నటించిన ప్రభాస్ ప్లాప్ సినిమా ఇదే!

Visitors Are Also Reading