ప్రస్తుత కాలంలో యూత్ నుంచి అంకుల్స్ వరకు ఎక్కువగా ఇష్టపడే ద్విచక్ర వాహనాల్లో ముందు వరుసలో ఉండేది బుల్లెట్ బైక్.. దీన్నే రాయల్ ఎన్ఫీల్డ్ అని కూడా పిలుస్తారు.. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లో అనేక రకాల మోడల్స్ ఉన్నాయి.. ఈ బైకు అంటే యూత్ లో ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ లో సరికొత్త లుక్ లో మరో బైక్ మన ముందుకు వచ్చింది అదే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ‘డ్రాకరీస్’.. మరి బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం..
Advertisement
also read:రాత్రి సమయంలో ఈ ఆహారపదార్థాలు తింటే పీడకలలు రావడం పక్కా..!
Advertisement
డ్రాకరీస్ అనే పదం డ్రాగన్ ఫైర్ ని సూచిస్తుంది.. హైవేపై ఈ బైక్ పట్టుకొని వెళ్ళామంటే అందరి చూపు మన వైపే ఉంటుందని చెప్పవచ్చు.. దీనిపై కూర్చొని సరికొత్త రైడింగ్ అనుభవాన్ని పొందే విధంగా దీన్ని తయారు చేశారు. కస్టమర్లకు అనుకూలంగా ఉండే విధంగా సరికొత్త సీట్ సెటప్, సరికొత్త సస్పెన్షన్ సిస్టంతో రోడ్డుపై దూసుకెల్లొచ్చు. కొత్త లుక్ లో ఇంధన ట్యాంక్, స్పీడు సూచించే మీటర్ ఉంది..
చూడగానే యూత్ ఇష్టపడే విధంగా సరికొత్త మోడిఫికేషన్ తో ఈ బైక్ ను మన ముందుకు తీసుకు వచ్చారు కంపెనీవారు.. ఈ బైకులు ఎక్కువగా బ్లాక్ మరియు కాపర్ కలర్ లో అందుబాటులోకి వచ్చాయి.. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా యొక్క స్టాక్ మోడల్ 346CC, ఎయిర్ కూల్ ఇంజన్19.8HP, 5250RPM సామర్థ్యంతో మరియు 28NM అంటే4000RPM గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది..5 స్పీడ్ గేర్ బాక్స్ తో సరికొత్త లుక్ లో అందుబాటులోకి వచ్చింది..
also read: